Viral Video Sparks Police Probe: రెచ్చిపోయిన ప్రిన్సిపల్, టీచర్ ... స్కూలు ఆవరణలో పాడు పని..
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:58 PM
స్కూలు ఆవరణలో ప్రిన్సిపల్, పీటీ టీచర్ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. స్కూలు దగ్గరకు వెళ్లారు. మందు తాగుతున్న ప్రిన్సిపల్, పీటీ టీచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే తప్పుదోవపడుతున్నారు. దేవాలయాల్లాంటి స్కూళ్లలో పాడు పనులు చేస్తున్నారు. తాజాగా, ప్రిన్సిపల్, పీటీ టీచర్ స్కూలు ఆవరణలోనే రెచ్చిపోయారు. మందు సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు. పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సాగర్ జిల్లాలోని ఖురాయ్ బ్లాక్ జర్హౌలా జాగిర్‌లో సీఎం రైజ్ స్కూలు ఉంది.
ఆ స్కూలు ప్రిన్సిపల్ ఆర్పీ నమ్‌దేవ్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ సందీప్ సింగ్ ఠాకూర్ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి పాడు పనికి తెరతీశారు. స్కూలు ఆవరణలో మందు సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. స్కూలు దగ్గరకు వెళ్లారు. మందు తాగుతున్న ప్రిన్సిపల్, పీటీ టీచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఆ ఇద్దరూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
గ్రామస్తులు వారిని వదల్లేదు. స్కూలు బయటకు వచ్చి ప్రిన్సిపల్, పీటీ టీచర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలెట్టారు. కొద్దిసేపటి తర్వాత పీటీ టీచర్ కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. మొత్తం సంఘటనను వీడియో తీస్తున్న ఓ గ్రామస్తుడిపై దాడి చేశారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చచెప్పి అక్కడినుంచి పంపేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్, పీటీ టీచర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
కిలాడీ లేడీలు.. వాంతి చేసుకుంటారు.. బంగారం దోచేస్తారు..
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు