Share News

Potato phone charge: ఇది నిజంగా సాధ్యమా.. బంగాళాదుంపలతో ఫోన్‌కు ఛార్జింగ్ ఎలా పెడుతున్నాడో..

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:23 PM

ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మశక్యం కాని వీడియోలు కూడా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి వెరైటీ ట్రిక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది

Potato phone charge: ఇది నిజంగా సాధ్యమా.. బంగాళాదుంపలతో ఫోన్‌కు ఛార్జింగ్ ఎలా పెడుతున్నాడో..
viral experiment video

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మశక్యం కాని వీడియోలు కూడా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి వెరైటీ ట్రిక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (viral experiment video).


@VijayKushw60161 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రెండు బంగాళాదుంపలతో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నాడు. ముందుగా రెండు బంగాళాదుంపల మధ్య ఒక 10 రూపాయల నాణెం ఉంచాడు. తర్వాత ఒక బంగాళాదుంపలో ఛార్జర్‌ను ఉంచి, ఫోన్‌కు తగిలించాడు. ఆశ్చర్యకరంగా ఆ ఫోన్ ఛార్జ్ కావడం ప్రారంభమవుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (mobile charging hack).


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.7 లక్షల మందికి పైగా వీక్షించారు (potato electricity myth). వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది సాధ్యమేనా. మీరు చెప్పండి' అని కామెంట్ చేశారు. ఇది రియల్ లైఫ్‌లో జరగదని, రీల్ లైఫ్‌లో మాత్రమే జరుగుతుందని మరొకరు పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీ మార్కెట్‌లోకి వచ్చిందని మరొకరు అన్నారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2025 | 06:23 PM