Leopard Attack On Police: పోలీస్ అధికారిపై దాడి చేసిన చిరుత.. అదృష్టం బాగుండి...
ABN , Publish Date - Nov 11 , 2025 | 09:46 PM
రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఓ పోలీస్ అధికారిపై చిరుత దాడి చేసింది. ఆయన్ని గాయపరిచింది. అదృష్టం బాగుండి ఆయన దాన్నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనారణ్యంలోకి వచ్చిన చిరుతను కాపాడ్డానికి వెళ్లిన పోలీస్‌కు దారుణమైన అనుభవం ఎదురైంది. ఆ చిరుతపులి ఆయనపైనే దాడి చేసింది. అదృష్టం బాగుండి ఆయన స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ చిరుత మహావితరన్ ఎమ్‌ఎస్ఈబీ ప్రాంతంలోకి వచ్చింది. దాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పారు. అటవీ అధికారులతో పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో చిరుత అటు, ఇటు పరిగెత్తుతూ బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులను బెంబడించింది. ఓ పోలీస్‌పై దాడికి సైతం దిగింది. అక్కడున్న వారు గట్టిగా అరవటంతో ఆయన్ని వదిలి వెనక్కు వెళ్లిపోయింది. ఆ పోలీస్ బతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి పారిపోయాడు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆ చిరుతపులి దొరకలేదు. అటవీ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక, ఈ సంఘటనలో ఇద్దరు గ్రామస్తులతో పాటు ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇష్టం వచ్చినట్లు అడవుల్ని కొట్టేస్తే ఊర్లలోకి రాక ఇంకేం చేస్తాయ్. అంతా మన తప్పే’..‘ఈ మధ్యకాలంలో అడవి జంతువులు తరచుగా ఊర్లలోకి వచ్చేస్తున్నాయి’..‘ఆ పోలీస్ అదృష్టం బాగుంది. లేదంటే ప్రాణాలు పోయేవి’..‘పట్టు కోవడానికి వెళితే ప్రాణాలు తీయబోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రాజెక్టు తలమీద ఉన్నా.. కొన్ని మండలాలకు నీళ్లు అందట్లేదు: కవిత
గత టీటీడీ బోర్డు తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: పవన్