Shocking Video: రైళ్లలో ప్రయాణించేటపుడు జాగ్రత్త.. ఇలా కూడా దొంగతనాలు జరుగుతాయి..
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:24 PM
రైలు ప్రయాణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏదైనా పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇలా కూడా దొంగతనాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.

ప్రయాణ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులను చోరీ చేసే అవకాశం దొరకడం లేదు. దీంతో చాలా మంది మొబైల్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైలు ప్రయాణ (Train Journey) సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏదైనా పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇలా కూడా దొంగతనాలు (Theft) జరుగుతాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.
@BhanuNand అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రైలు వేగంగా వెళుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కన కర్ర పట్టుకుని నిల్చున్నాడు. ఎవరైనా ట్రైన్ డోర్ దగ్గర నిలబడితే వారిని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి రైలు డోర్ దగ్గర నిలబడి మొబైల్ చూసుకుంటున్నాడు. కిందన ఉన్న దొంగ పైకి ఎగిరి అతడి చేతి మీద కొట్టాడు. దీంతో ఆ మొబైల్ కింద పడిపోయింది. ఆ మొబైల్‌ను పట్టుకుని ఆ దొంగ పారిపోయాడు. అంతే కాదు ఆ ఘటనను రికార్డు కూడా చేశాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 3.3 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఒక సూపర్ దొంగ మాత్రమే కదులుతున్న రైలు నుండి ఫోన్‌ను దొంగిలించగలడని ఒకరు కామెంట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని, రైలులో గేట్ వద్ద ఫోన్‌ను ఉపయోగించవద్దని మరొకరు సూచించారు. సూపర్ దొంగలను కంట్రోల్ చేయాలంటే అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గమని మరొకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఉడుము పట్టు అంటే ఇదేనేమో.. రెండు ఉడుముల ఫైటింగ్ చూశారా?
ఇలాంటి భార్య ఉంటే అదృష్టమే.. ఆ భర్త ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..