Share News

Coconut injection: కొబ్బరి నీళ్లు కూడా సురక్షితం కాదా.. ఈ వీడియో చూస్తే షాక్‌తో నివ్వెరపోవాల్సిందే..

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:41 PM

సాధారణంగా కొబ్బరి కాయలు చాలా సురక్షితమైనవని, కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నమ్ముతాం. చాలా పళ్లు, కూరలను కృత్రిమంగా పక్వానికి తీసుకొస్తారని, పలు రసాయనాలు వాడతారని అనుకుంటాం.

Coconut injection: కొబ్బరి నీళ్లు కూడా సురక్షితం కాదా.. ఈ వీడియో చూస్తే షాక్‌తో నివ్వెరపోవాల్సిందే..
coconut injection

సాధారణంగా కొబ్బరి కాయలు చాలా సురక్షితమైనవని, కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నమ్ముతాం. చాలా పళ్లు, కూరలను కృత్రిమంగా పక్వానికి తీసుకొస్తారని, పలు రసాయనాలు వాడతారని అందరికీ తెలిసిందే. మామిడి పళ్లు, అరటి పళ్లు మొదలైన వాటిని పండించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనం వాడతారనే సంగతి తెలిసిందే. అయితే కొబ్బరి కాయలను కూడా కృతిమంగా పెద్దవిగా చేయడానికి ఇంజెక్షన్లు వాడుతున్నారు (coconut growth hack).


@Impression88988 అనే ఎక్స్ యూజర్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వీడియోలో ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కి అప్పుడే పూసిన కొబ్బరి పిందెలకు ఏదో ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఆ ఇంజెక్షన్ చేసిన కొద్ది రోజులకే ఆ కాయలు పెద్దవిగా అయిపోతాయట. కేవలం వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొబ్బరికాయలను ఇలా కృత్రిమంగా పెద్దవిగా చేయడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది (plant growth chemicals).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (coconut growth methods). వందల మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మనం మొక్కల నుంచి విషం మాత్రమే పండించగలం అని ఒకరు కామెంట్ చేశారు. ఇప్పుడు వ్యవసాయాన్ని వ్యాపారం శాసిస్తోందని మరొకరు పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవితాలంటే ప్రతి ఒక్కరికీ అలుసే అంటూ చాలా మంది స్పందించారు.


ఇవి కూడా చదవండి..

స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 01 , 2025 | 06:41 PM