Wedding night escape: పెళ్లయిన తొలిరాత్రే వరుడు జంప్.. మూడు రోజుల తర్వాత..
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:32 PM
పెళ్లి గురించి అమ్మాయిలైనా కాస్తంత ఆందోళన చెందుతారేమో గానీ, అబ్బాయిలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి జరిగిన తొలి రాత్రే వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు.
వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత మధురమైన ఘట్టం. ఎంతో సంతోషంగా, సంబరంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. పెళ్లి గురించి అమ్మాయిలైనా కాస్తంత ఆందోళన చెందుతారేమో గానీ, అబ్బాయిలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి జరిగిన తొలి రాత్రే వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అతడిని మూడ్రోజులు వెతికి పట్టుకున్నారు (panicked groom leaves home).
మేరఠ్‌కు సమీపంలోని ఉంచాపూర్‌కు చెందిన మోను అనే 26 ఏళ్ల యువకుడికి నవంబర్ 27వ తేదీన వివాహం జరిగింది. ఆ రోజు రాత్రి కరెంట్ బల్బు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోను ఎంత సేపటికీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా రాత్రి సమయంలో మోను గంగా నది ఒడ్డున తిరుగుతూ కనిపించాడు. దీంతో అక్కడకు వెళ్లి ఎంత వెతికినా మోను ఆచూకీ దొరకలేదు. మూడ్రోజుల పాటు మోను ఆచూకీ ఎవరికీ తెలియలేదు (groom found in Haridwar).
చివరకు సోమవారం నాడు వేరొకరి ఫోన్ నుంచి తన తండ్రికి మోను ఫోన్ చేసి తాను హరిద్వార్‌లో ఉన్నానని, ఇంటికి రావాలనుకుంటున్నానని చెప్పాడు (bizarre groom incident). దీంతో మోను తండ్రి, పోలీసులు హరిద్వార్ వెళ్లి మోనును పట్టుకున్నారు. పెళ్లి రోజు రాత్రి భయాందోళనకు గురై హరిద్వార్ బస్సు ఎక్కానని, అక్కడే ఉండిపోయానని చెప్పాడు. స్నేహితుల సలహా మేరకు పెళ్లి రోజు కొన్ని మాత్రలు తీసుకున్నాడని, దాని వల్లే మానసిక అశాంతికి గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..