Share News

Pakistan Water Problem: భారత్ యాక్షన్.. పాకిస్తాన్ గిల గిల

ABN , Publish Date - Apr 26 , 2025 | 06:28 PM

Pakistan Water Problem: నీటి కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్‌కు భారత్ నిర్ణయంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థతి ఏర్పడింది. తాగడానికి కూడా నీళ్లు లేకుండా అక్కడి జనం అల్లాడుతున్నారు. పాక్‌కు నీటి సరఫరా ఆపివేయటంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Pakistan Water Problem: భారత్ యాక్షన్.. పాకిస్తాన్ గిల గిల
Pakistan Water Problem

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌కు సింధు జలాలను సరఫరా కాకుండా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అసలే నీటి కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్‌కు భారత్ నిర్ణయంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నీటి సరఫరా నిలిపి వేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా తప్పుబట్టింది. నీటిని నిలిపివేయటం యుద్ధానికి కాలు దువ్వటమే అంటూ మండిపడింది. మొత్తానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. అయితే, గత కొద్దిరోజుల నుంచి నీటి సరఫరా లేకపోవటంతో పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థతి ఏర్పడింది. తాగడానికి కూడా నీళ్లు లేకుండా అక్కడి జనం అల్లాడుతున్నారు.


భారత్.. పాక్‌కు నీటి సరఫరా ఆపివేయటం, అక్కడి పరిస్థితులపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన వారే ఈ మీమ్స్, వీడియోలు పోస్టు చేయటం గమనార్హం. వారిపై వారే సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు. ఫైజన్ అనే పాకిస్తాన్ నెటిజన్.. నీటిని ఇవ్వాలంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. చాలా మంది పాకిస్థానీలు తమ పరిస్థితిని కామెడీగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బాధపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మీద బాంబు వేస్తే.. ఇంతటితో గొడవ ముగుస్తుందని ఓ పాకిస్తానీ నెటిజన్ కామెంట్ చేసింది.


పాకిస్తాన్‌కు తిరుగు ప్రయాణం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సాధారణ వీసాల గడుపు రేపటితో తీరనుంది. మెడికల్ వీసాల గడువు 29 వరకు ఉంది. గడువు తేదీ కంటే ముందే పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి క్యూలు కట్టారు. సరిహద్దు దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల వరకు లైను ఉంది. అందరూ తమ తట్టా బుట్టా సర్దుకుని పాకిస్తాన్ వెళ్లిపోతున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Massive Explosion: అత్యంత భారీ పేలుడు.. కిలోమీటర్ వరకు ప్రభావం

Barmer Bridegroom: భారత్- పాక్ సరిహద్దు దగ్గరకు ఊరేగింపుగా వరుడు.. ఊహించని షాకిచ్చిన ఆర్మీ..

Updated Date - Apr 26 , 2025 | 06:28 PM