Share News

Noida Woman Fight: మహిళల మధ్య వాట్సాప్‌లో పంచాయితీ.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడి

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:32 PM

వాట్సాప్‌లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ వారు చివరకు నడివీధిలో దెబ్బలాటకు దిగే వరకూ వెళ్లింది. నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Noida Woman Fight: మహిళల మధ్య వాట్సాప్‌లో పంచాయితీ.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడి
Noida Woman Fight

ఇంటర్నెట్ డెస్క్: నోయిడాలో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ చివరకు వారు బాహాబాహీకి దిగే వరకూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూ జనాలను షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రజల్లో తగ్గుతున్న సహనం దారుణ పరిణామాలకు కారణమవుతోందంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు.

నోయిడాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మీడియా కథనాల ప్రకారం, వాహనాలు ఇద్దరూ ఒకే రెసిడెన్షియల్ సొసైటీలో ఉంటున్నారు. ఘర్షణకు ముందు రోజు ఇద్దరు మహిళలు వాట్సాప్‌లో గొడవ పడ్డారు. ఒకరిని ఒకరు పరుషల పదజాలంతో విమర్శించుకున్నారు. పరిస్థితి తిట్టుకునే వరకూ వెళ్లింది. ఆ తరువాత వాట్సాప్‌లో ఘర్షణ చివరకు బయట బాహాబాహీకి దారి తీసింది.


వాట్సాప్ గొడవ తరువాత సొసైటీ గేటు వద్ద మహిళలు ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. దీంతో, నిన్నట్టి ఆగ్రహం మరోసారి ఇద్దరిలోనూ పెల్లుబుకింది. ఈ క్రమంలో ఓ మహిళ రెండో వ్యక్తిని జుట్టుపట్టి నానా రభసా చేసింది. నిన్ను వదిలిపెట్టే లేదంటూ గోలగోల చేసింది. ఎంత మంది వచ్చి వారించినా వినకుండా పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. పోలీసులను పిలవండి, నన్నే ఇంత మాట అంటుందా? నానా యాగీ చేసింది. ఆగ్రహంతో ఊగిపోతున్న ఆమెను ఎలా నిలువరించాలో తెలీక చుట్టుపక్కల వాళ్లు తెగ కంగారు పడిపోయారు. ఈలోపు పోలీసులు వచ్చి తగవు సద్దుమణిగేలా చేశారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


కాగా, ఇటీవల పంజాబ్‌లోని మోహాలిలో దాదాపు ఇలాంటి ఘటన దారుణ మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వ్యక్తి చేసిన దాడిలో ఓ శాస్త్రవేత్త దుర్మరణం చెందాడు. అప్పటికే అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా జరిగింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న అతడిపై పొరుగింటి వ్యక్తి దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. ఈ దాడిలో నిందితుడు మాంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 06:33 PM