Nita Ambani: సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు.. స్టాఫ్ మెంబర్ పుట్టిన రోజున సెలబ్రేషన్స్..
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:56 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు. కోట్లకు పడగలెత్తిన నీతా తన ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో చాటి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Nita Ambani staff celebration).
నీతా అంబానీ తన టీమ్ మెంబర్ పుట్టిన రోజును దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేశారు. తన దగ్గర పని చేసే మహిళా ఉద్యోగి పుట్టిన రోజున నీతా అంబానీ దగ్గరుండి కేట్ కట్ చేయించారు. కేక్ తినిపించి మరీ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీమ్‌లోని మిగిలిన వారు 'హ్యాపీ బర్త్‌డే' పాట పాడుతుండగా, నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పక్కన నిలబడి ఉన్నారు. ఈ వీడియోను బర్త్ డే జరుపుకున్న ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు (viral Ambani video).
'నా పట్ల మీరు చూపిన దయకు చాలా ధన్యవాదాలు మేడమ్. మీరు ఎల్లప్పుడూ నా పుట్టిన రోజును ప్రత్యేకంగా మారుస్తారు. మీకు రుణపడి ఉన్నాను' అంటూ ఆ ఉద్యోగి ధన్యవాదాలు తెలిపారు (Nita Ambani birthday surprise). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీతాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీతా అంబానీ ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..
మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..