Sweet Infused With Edible Gold: బంగారంతో చేసిన స్వీట్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 07:58 PM
ఆ స్వీట్ పేరు ‘స్వర్ణ ప్రసాదమ్’. దాని ధర కిలో అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. ఆ స్వీటును చిల్‌గోజాతో తయారు చేశారు. దానిపై తినడానికి వీలైన 24 క్యారెట్ల బంగారం పూతను పూశారు.
దేశ వ్యాప్తంగా రెండు రోజుల ముందు నుంచే దీపావళి సందడి మొదలైంది. దీపాలు, బాణసంచాతో పాటు మిఠాయిలకు కూడా గిరాకీ పెరిగిపోయింది. కస్టమర్లను ఆకర్షించడానికి మిఠాయి షాపుల వాళ్లు కొత్త కొత్త స్వీట్లు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ స్వీట్ షాపు తయారు చేసిన ఓ స్వీట్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.
ఆ స్వీట్ పేరు ‘స్వర్ణ ప్రసాదమ్’. దాని ధర కిలో అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. ఆ స్వీటును చిల్‌గోజాతో తయారు చేశారు. దానిపై తినడానికి వీలైన 24 క్యారెట్ల బంగారం పూతను పూశారు. ఆ స్వీట్ గురించి షాపు యజమాని అంజలి జైన్ మాట్లాడుతూ.. ‘ఈ స్వీట్ ఈ రోజున ఇండియాలోనే అత్యంత ఖరీదైనది. దాని ధర 111000 రూపాయలు. అంతా ప్రీమియం క్వాలిటీ. దాన్ని నగల బాక్సులో ప్యాక్ చేసి ఇస్తాం.
ఆ స్వీట్‌ను చిల్‌గోజాతో తయారు చేశాము. అది చాలా ఖరీదైన డ్రైఫ్రూట్’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఖరీదైన స్వీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ స్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ స్వీట్ కొనేబదులు 10 గ్రాముల గోల్డ్ కొనండి. భవిష్యత్తులో బాగు పడతారు’.. ‘దాన్ని కొన్న తర్వాత తినాలా లేక ఖరీదైనది కదా అని బ్యాంకులో దాచుకోవాలా?’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఒక బైక్ మీద ఎలా వెళ్తున్నారో చూడండి..
ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ