Clever idea: ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:10 PM
అవసరం నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. మన దేశంలో సామాన్యులు కూడా అసాధారణంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సరికొత్త ఐడియాలతో సులభమైన పరిష్కారాలు కనిపెడతారు.
అవసరం నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. మన దేశంలో సామాన్యులు కూడా అసాధారణంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సరికొత్త ఐడియాలతో సులభమైన పరిష్కారాలు కనిపెడతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Indian innovation).
@MdZeyaullah20 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా ఎవరైనా వ్యక్తి ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడాలనుకుంటే ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. అయితే ఇయర్ ఫోన్స్ అందుబాటులో లేకపోతే ఏం చేయాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి దానికి విచిత్రమైన పరిష్కారం కనిపెట్టాడు. అతడు మెషిన్‌తో బట్టలు కుడుతున్నాడు. అతడి రెండు చేతులు ఖాళీగా లేవు. దీంతో అతడు ఫోన్ పెట్టుకునేందుకు వీలుగా తన తలకు పట్టేలా ఓ పట్టీని కుట్టుకుని తగిలించుకున్నాడు (smart solution).
చెవికి దగ్గరగా ఆ ఫోన్ వచ్చేలా పెట్టుకుని హాయిగా మాట్లాడుకుంటున్నాడు (desi jugaad). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ప్రేమలో పడిన వారే ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారని ఒకరు కామెంట్ చేశారు. ఇతడు అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించాడని ఒకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
ఆమెకు 18.. అతడికి 55.. వీరి విచిత్రమైన ప్రేమకథ గురించి తెలిస్తే..
మీ తెలివికి పరీక్ష.. ఈ కొండ మీదున్న మరో మనిషిని 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..