Share News

woman eats live prawn: బతికి ఉన్న రొయ్య తినాలనుకుంది.. ఆమెకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN , Publish Date - Aug 25 , 2025 | 07:28 PM

ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రకరకాల ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు కూరగాయలు, పళ్లు తినేందుకు మాత్రమే ఇష్టపడతారు. మరికొందరు ఇతర జంతువుల మాంసాన్ని వండుకుని తింటారు. అయితే మిగతా వారితో పోలిస్తే చైనీయుల ఆహారపు అలవాట్లు విచిత్రంగా ఉంటాయి.

woman eats live prawn: బతికి ఉన్న రొయ్య తినాలనుకుంది.. ఆమెకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..
woman eats live prawn

ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రకరకాల ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు కూరగాయలు, పళ్లు తినేందుకు మాత్రమే ఇష్టపడతారు. మరికొందరు ఇతర జంతువుల మాంసాన్ని వండుకుని తింటారు. అయితే మిగతా వారితో పోలిస్తే చైనీయుల (China) ఆహారపు అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. వారు రకరకాల కీటకాలు, మనం చూడడానికే భయపడే జీవులను కూడా తింటుంటారు. ముఖ్యంగా బతికి ఉన్న జీవులను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (live prawn incident).


@PicturesFoIder అనే ట్విటర్ ఖాతాలో ఆ వీడియో (shocking food video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చైనాకు చెందిన ఓ మహిళ ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. రెస్టారెంట్ టేబుల్ వద్ద తినడానికి రెడీ అవుతోంది. బతికి ఉన్న ఓ రొయ్యను తీసుకుని తన ప్లేట్‌లో వేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అది అటూ ఇటూ కదిలిపోయింది. దీంతో ఆమె దానిన భయంతో వదిలేసింది. ఆ తరువాత, ఆమె చాప్ స్టిక్‌తో రొయ్యను తీసుకోవడానికి ప్రయత్నించింది (bizarre food attempt).


ఆ రొయ్య ప్లేట్ నుంచి ఎగిరి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కొరికి పారేసింది (prawn video viral). దీంతో ఆ యువతి బాధతో అరుపులు, కేకలు వేసింది. వేరే వ్యక్తి వచ్చి ఆ రొయ్యను బలవంతంగా బయటకు లాగాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను 77 లక్షల మంది వీక్షించారు. 8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆమెకు అలాంటి శాస్తి జరగాల్సిందేనని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

పిల్లలకు బాతు జీవిత పాఠం.. సరస్సులో పిల్లలతో తల్లి బాతు ఎలా ఆడుతోందో చూడండి..

మీ చూపు చురుకైనది అయితే.. ఈ 37ల మధ్యలో భిన్నమైన వాటిని 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2025 | 07:28 PM