Share News

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్‌ తీసుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:50 PM

కత్తి లేదా బుల్లెట్ గాయం జరిగినప్పుడు చికిత్స‌కు పెద్ద మొత్తంలో కర్చు అవుతుంది. అలాంటి సమయంలో మనకు ఆరోగ్య బీమా వర్తిస్తుందా? దాని నియమాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్‌ తీసుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి..
Health Insurance

Health Insurance: మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా ఆకస్మిక ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ముందుగానే ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఏదైనా చికిత్స సమయంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే, కత్తి లేదా బుల్లెట్ సంఘటన జరిగినప్పుడు, మీరు ఈ చికిత్స కోసం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందుతారా? లేదా మీ జేబులో నుండి ఖర్చు చేయవలసి ఉంటుందా? కత్తి లేదా బుల్లెట్ గాయం విషయంలో ఆరోగ్య బీమా నియమాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య బీమా ప్రధాన లక్ష్యం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్సకు అయ్యే ఖర్చు భారం కాకుండా కాపాడటం. ఉద్యోగులకు తాము పనిచేసే కంపెనీల ద్వారా దొరికే కవరేజ్ ఎంత? దానికి వర్తించే నియమాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా కంపెనీ పాలసీలలో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు ఉద్యోగి చెల్లించకుండా ఉండే వెసులుబాటు ఉంటుంది. అలాగే కొన్ని పాలసీలలో 80- 90% ఖర్చులు కంపెనీ పాలసీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉద్యోగి పనిచేసే కంపెనీ మీద ఆధారపడి ఉంటాయి. క్లెయిం సెటిల్మెంట్ రేట్ 90% కంటే ఎక్కువ ఉన్న కంపెనీలో ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం మంచిది.


ఇటీవల, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు కత్తి దాడి చేసిన సంగతి తెలిసింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, సైఫ్ అలీఖాన్‌కి ఒక వారానికి సుమారు రూ. 36 లక్షల బిల్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆరోగ్య బీమా నియమాలు ఏమిటి? అనేది తెలిసి ఉండాలి.

ఆరోగ్య బీమా వర్తిస్తుంది..

కత్తి లేదా బుల్లెట్ గాయం అయినప్పుడు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అయితే, ఇది కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చాలా ఆరోగ్య బీమా పాలసీలలో ప్రమాదాలకు సంబంధించిన గాయాలకు రక్షణ ఉంటుంది. కత్తిపోట్లు లేదా తుపాకీ ప్రమాదం లేదా అనుకోని హింసాత్మక సంఘటన వల్ల సంభవించినట్లయితే అది కవర్ చేయవచ్చు. కానీ ఏదైనా నేరపూరిత చర్య సమయంలో కత్తి లేదా బుల్లెట్ గాయం జరిగి, పోలీసులు మీపై కేసు నమోదు చేస్తే ఆరోగ్య బీమా కంపెనీ దానిని కవర్ చేయడానికి నిరాకరిస్తుంది.

ఈ విషయాలపై జాగ్రత్త..

గాయంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీ వర్తిస్తుంది. సాధారణంగా, చిన్న గాయాల చికిత్స వంటి ఔట్ పేషెంట్ ఖర్చులు పాలసీ పరిధిలోకి రావు. సంఘటన తీవ్రమైన గాయంగా మారినట్లయితే, క్రిటికల్ ఇల్‌నెస్ అయితే ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అయితే, ఇలాంటి సంఘటనలలో, క్లెయిమ్ కోసం పోలీసు నివేదిక (FIR)లేదా ఇతర చట్టపరమైన పత్రాల అవసరం ఉంటుంది. వివిధ పాలసీ కంపెనీలకు వేర్వేరు పరిస్థితులు ఉండవచ్చు. మీరు ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడల్లా మీరు దాని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి.

Also Read: పానిక్ అటాక్ లక్షణాలు ఏమిటి.. దానిని ఎలా నియంత్రించాలి..

Updated Date - Jan 24 , 2025 | 05:06 PM