Abandoned Newborn Found: మహిళా పోలీస్ మంచి మనసు.. రోడ్డుపై దొరికిన పసికందుకు..
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:28 PM
పోలీసులు వెంటనే అరుపులు వినపడ్డ వైపు వెళ్లారు. అక్కడ వ్యాన్ల మధ్య దుస్తుల్లో చుట్టి ఉంచిన చిన్నారి కనిపించింది. హుటాహుటిన ఆ చిన్నారిని శతాబ్ధి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చిన్నారికి వైద్యం అందించారు.
రోడ్డుపై దొరికిన ఓ పసికందుకు మహిళా పోలీస్ తల్లిగా మారింది. ఆకలితో అల్లాడుతున్న చిన్నారికి ఎంతో శ్రద్ధతో పాలు తాగించింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాంగర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సోమవారం అర్థరాత్రి గోరేగావ్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు పక్క పార్క్ చేసిన వాహనాల మధ్యలోంచి పసికందు ఏడుపు వారికి వినిపించింది.
పోలీసులు వెంటనే అరుపులు వినపడ్డ వైపు వెళ్లారు. అక్కడ వ్యాన్ల మధ్య దుస్తుల్లో చుట్టి ఉంచిన చిన్నారి కనిపించింది. హుటాహుటిన ఆ చిన్నారిని శతాబ్ధి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చిన్నారికి వైద్యం అందించారు. పసికందుకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులకు చెప్పారు. కొన్ని గంటల తర్వాత పాపను డిశ్చార్జ్ చేశారు. పోలీసులు పాపను కస్టడీలోకి తీసుకున్నారు. నిర్భయ స్క్వాడ్‌లోని ఓ మహిళా పోలీసు చిన్నారి బాధ్యత తీసుకుంది.
చిన్నారి ఆకలితో ఏడుస్తూ ఉంటే ఆ మహిళా పోలీసు స్పూన్ ద్వారా ఎంతో శ్రద్ధగా పాలు తాగించింది. ఓ తల్లిలాగా ఎంతో ఓపిగ్గా సేవలు చేసింది. పాలు తాగించిన తర్వాత చిన్నారిని సెయింట్ క్యాథరిన్ హోమ్‌లో అప్పగించారు. మహిళా పోలీసు పాపకు పాలు తాగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మహిళా పోలీసుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. శభాష్ మేడమ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిదిపై వదిన దారుణం.. తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని..
జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించండి..