Share News

Milk Adulteration: మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:11 PM

ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Milk Adulteration: మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు
Milk Adulteration

మనుషుల్లో మానవత్వం మెల్లమెల్లగా నశించిపోతోంది. కొంతమంది డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. వాటిని తిన్న జనం అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కల్తీ పాల దందాకు చెక్ పెట్టారు.


ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ముంబై, అంధేరీలోని వెస్ట్ కపస్వాడీకి చెందిన ఓ వ్యక్తి ఈజీ మనీ కోసం క్రిమినల్ పనికి తెరతీశాడు. ఇంట్లోనే కల్తీ పాలు తయారు చేయటం మొదలెట్టాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. చాలా నెలల నుంచి కల్తీ పాల దందా కొనసాగిస్తున్నాడు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో నిందితుడు పాలు తయారు చేస్తున్న సమయంలో ఇంటికి వెళ్లారు.


రెడ్ హ్యాండెడ్‌గా అతడ్ని పట్టుకున్నారు. ఇంట్లో లీటర్ల కొద్దీ కల్తీ పాలు ఉన్నాయి. వాటిని పాకెట్లలో నింపి ప్యాక్ చేస్తూ ఉన్నాడు. ఓ చిన్న కుటీర పరిశ్రమలాగా కల్తీ పాల దందాను కొనసాగిస్తున్నాడు. అతడు అమ్మే పాలు గేదె పాలకు ఏ మాత్రం తీసిపోకుండా అచ్చం అలానే కనిపిస్తూ ఉన్నాయి. కంపెనీలో చేసినట్లుగా ఎంతో నైపుణ్యంతో పాల ప్యాకెట్లను ప్యాకింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నావు అంటూ మండిపడుతున్నారు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..

పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

Updated Date - Dec 27 , 2025 | 03:17 PM