Share News

Pushpa 2 Stampede: పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:21 PM

2024 డిసెంబర్ నెలలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Pushpa 2 Stampede: పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం
Pushpa 2 Stampede

పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా.. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. 2024 డిసెంబర్ నెలలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.


డిసెంబర్ 3వ తేదీ రాత్రి విషాదం

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. ప్రీమియర్ షో చూడ్డానికి హైదరాబాద్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. జైలులో కూడా ఉన్నారు.


కాగా, ప్రమాదం జరిగి సంవత్సరం అయినా కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ మాట్లాడలేకుండా.. నడవలేకుండా ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక, శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవటానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్‌లో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.


ఇవి కూడా చదవండి

దాదాపు 15 ఏళ్ల తర్వాత.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం

పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

Updated Date - Dec 27 , 2025 | 02:43 PM