Shocking marriage news: అల్లుడితో అఫైర్.. పెళ్లికి రెడీ.. కూతురికి విషయం తెలిసి అడ్డు రావడంతో..
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:33 AM
ఓ తల్లి తన కూతురి జీవితంతోనే ఆటలాడుకుంది. తన సుఖం, సంతోషం కోసం మాస్టర్ ప్లాన్ వేసి కూతురి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెను చంపడానికి కూడా రెడీ అయిపోయింది.
ఓ తల్లి తన కూతురి జీవితంతోనే ఆటలాడుకుంది. తన సుఖం, సంతోషం కోసం కూతురి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెను చంపడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తిరుపతి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది (Mother attacks daughter).
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు ఐదు నెలల క్రితం 15 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక తండ్రి చనిపోవడంతో 40 ఏళ్ల తల్లి వారితో పాటు ఒకే ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో 18 ఏళ్ల వయసున్న అల్లుడితో 40 ఏళ్ల అత్త అఫైర్ పెట్టుకుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో కూతురి ఎదురుగానే అల్లుడి చేత తాళి కట్టించుకోవడానికి ఆ మహిళ సిద్ధమైంది (marriage to son-in-law).
తల్లి, భర్త పెళ్లి చేసుకుంటుండడాన్ని ఆ బాలిక అంగీకరించలేదు (mother marries son-in-law). వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో వారిద్దరూ రెచ్చిపోయారు. రోకలి బండతో ఆ బాలికను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. ఆ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి అరుపులు, కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల వారు ఆ బాలికను కాపాడి హాస్పిటల్‌కు తరలించారు. అత్త, అల్లుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..