Share News

Father's Day Cake: ఫాదర్స్ డే స్పెషల్ కేక్.. ఖరీదు రూ.5 లక్షలు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..

ABN , Publish Date - Jun 15 , 2025 | 07:24 PM

ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు చాలా మంది ఫాదర్స్ డే జరుపుకుంటారు. తండ్రి చేసిన త్యాగాలను, అతడి ప్రత్యేకతను గుర్తు చేసుకుంటారు. తండ్రిపై ప్రేమ, గౌరవాన్ని వ్యక్తీకరిస్తారు. కొందరు ప్రత్యేకంగా తండ్రి చేత కేక్ కూడా కట్ చేయించి సెలబ్రేట్ చేసుకుంటారు.

Father's Day Cake: ఫాదర్స్ డే స్పెషల్ కేక్.. ఖరీదు రూ.5 లక్షలు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
Most expensive Fathers Day Cake priced At Rs 5 Lakh

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు చాలా మంది ఫాదర్స్ డే (Father's Day) జరుపుకుంటారు. తండ్రి చేసిన త్యాగాలు, అతడి ప్రత్యేకతను గుర్తు చేసుకుంటారు. తండ్రిపై ప్రేమ, గౌరవాన్ని వ్యక్తీకరిస్తారు. కొందరు ప్రత్యేకంగా తండ్రి చేత కేక్ కూడా కట్ చేయించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆశ్చర్యకర వార్త వైరల్ అవుతోంది. ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫాదర్స్ డే కోసం ప్రత్యేకంగా చేసిన హాజెల్‌నట్ చాక్లెట్ కేక్ ధర అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది (Most expensive Cake).


ఆ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫాదర్స్ డే కోసం రూపొందించిన పలు ప్రత్యేక కేక్‌లను ప్రదర్శించారు. చాలా కేక్‌ల ధరలు రూ.499 నుంచి రూ.599 మధ్యలో ఉన్నాయి. అయితే హాజెల్‌నట్ చాక్లెట్ కేక్ ధర మాత్రం రూ.5లక్షలు అని కనబడుతోంది. ఓ వ్యక్తి ఆ యాప్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ కేక్‌లో అంత ప్రత్యేకత ఏంటో అని ప్రశ్నించాడు. నిజానికి అది యాప్‌లో సాంకేతిక లోపం లేదా టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు (Viral News).


ఓ కేక్‌కు అంత ధర నిర్ణయించడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ కేక్‌ను బంగారం లేదా వజ్రాలతో తయారు చేశారా? అని ఒకరు ప్రశ్నించారు. ఈ ధరతో ఐదు ఐఫోన్లను కొనుక్కోవచ్చని మరొకరు కామెంట్ చేశారు. మా నాన్న చేత ఇంత ఖరీదైన కేక్ కట్ చేయిస్తే కొడతాడు అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Japan: లంచ్ బ్రేక్‌లో ఇంటికొచ్చిన యువతి.. ఆమె బెడ్‌పై అర్ధనగ్నంగా బాస్.. తర్వాతేం జరిగిందంటే..

Snake Eagle video: ఈ పాము జీవిత పాఠం నేర్పుతోంది.. డేగను ఎలా మట్టికరిపించిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 08:51 PM