America vs India lifestyle: అమెరికా కంటే భారత్‌లోనే నిజమైన జీవితం.. హార్వార్డ్ గ్రాడ్యుయేట్ చెప్పింది వింటే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:51 PM
భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు లక్షల్లో ఉంటారు. హార్వర్డ్‌లో చదువుకున్న ఒక భారతీయ ప్రొఫెషనల్ మాత్రం మెరుగైన జీవనానికి అమెరికా కంటే భారత్ ఉత్తమం అని అభిప్రాయపడుతోంది. రేజర్‌పేలో డిజైన్ అసోసియేట్ డైరెక్టర్ చార్మి కపూర్ అమెరికాను కాకుండా భారత్‌ను తన నివాసంగా ఎంచుకోవడానికి గల కారణాలను వివరించారు.
మెరుగైన జీతాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, కావాల్సినంత స్వేచ్ఛ.. భూతల స్వర్గంగా భావించే అమెరికాలో జీవితం గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ కలలు కంటూ ఉంటారు. ఇక, భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు లక్షల్లో ఉంటారు. హార్వర్డ్‌లో చదువుకున్న ఒక భారతీయ ప్రొఫెషనల్ మాత్రం మెరుగైన జీవనానికి అమెరికా కంటే భారత దేశమే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. రేజర్‌పేలో డిజైన్ అసోసియేట్ డైరెక్టర్ చార్మి కపూర్ అమెరికాను కాకుండా భారత్‌ను తన నివాసంగా ఎంచుకోవడానికి గల కారణాలను వివరించారు (Harvard graduate chooses India).
చాలా మంది సోషల్ మీడియా ద్వారా తనను భారత్ కంటే అమెరికా జీవనం బాగుంటుంది కదా అని అడుగుతున్నారని పేర్కొంటూ దానికి తన సమాధానం తెలిపారు. 'అమెరికాలో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఎక్కువ డబ్బు , ఎక్కువ స్వేచ్ఛ ఉన్నాయి. కానీ భారతదేశంలో, కుటుంబం, సమాజం, ఆహారం ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎండలో వేచి ఉంటారు. సెక్యూరిటీ గార్డులు రోజంతా నిలబడతారు. పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ పనికి వస్తారు. వీధి వ్యాపారులకు చెడు రోజు అంటే ఏమిటో తెలుసు. ఇక్కడ కష్టనష్టాలను తెలుసుకునే వీలుంటుంద'ని చార్మి కపూర్ అన్నారు (life in India vs America).
'భారతదేశంలో ఉన్నప్పుడు నాకు అసంతృప్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికే ఎంత ఉందో నేను నిరంతరం గుర్తుంచుకుంటాను. అమెరికాలో ప్రజలందరి ప్రాథమిక అవసరాలు సులభంగా తీరిపోతాయి. కానీ, అక్కడి సమాజంలో ఓ అశాంతి ఎప్పుడూ ఉంటుంది. జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువ కోరుకునే భావన వారిలో ఉంటుంది. పరిమితి లేనటువంటి ఎక్కువ డబ్బు, ఎక్కువ విజయం వెంట పరుగులు పెడుతూనే ఉండాలి' అని చార్మి కపూర్ పేర్కొన్నారు (Indian lifestyle advantages).
'భారతదేశం ఒక సమష్టి సమాజం. ఇక్కడ, సహాయం చేసే ధోరణి సహజం. ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే మనకు సహాయం చేయడానికి వస్తారు. అమెరికాలో ఆ పరిస్థితి ఉండదు. భారతదేశం మనకు పోరాడడం నేర్పుతుంది. జీవితం అంటే కేవలం డబ్బు, సౌలభ్యం మాత్రమే కాదు. భావోద్వేగ సంబంధం, సమాజం నుంచి లభించే మద్దతు. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లే దానిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి' అని చార్మి కపూర్ విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..