Share News

Viral Video: మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..

ABN , Publish Date - Jun 05 , 2025 | 07:34 PM

Viral Video: చుట్టుపక్కలి వాళ్లను పిలిచి మరీ విషయం చెప్పాడు. జనం మెల్లిమెల్లిగా వారిని చుట్టుముడుతూ ఉన్నారు. పరిస్థితి చెయ్యిదాటుతోందని గుర్తించిన ఆ అమ్మాయిలు అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఆ మగాళ్లు మాత్రం వదల్లేదు. వారిని తోసుకుంటూ వెళ్లారు.

Viral Video: మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..
Viral Video

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోయింది. రోజు రోజుకు ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా, హిజాబ్ వేసుకోలేదన్న కారణంతో ఓ మగాళ్ల గుంపు ముగ్గురు అమ్మాయిలతో అత్యంత దారుణంగా ప్రవర్తించింది. వారిపై దాడికి సైతం దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ నలుగురు అమ్మాయిలు పాకిస్తాన్‌లోని ఓ బిజీ రోడ్డులో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు.


ఆ రోడ్డులో ఆ నలుగురు అమ్మాయిలు తప్ప వేరే ఆడవాళ్లు లేరు. ఆ నలుగురు అమ్మాయిల్లో.. ఓ అమ్మాయి మాత్రమే హిజాబ్ వేసుకుంది. మిగిలిన ముగ్గురు వేసుకోలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి వారిని పక్కకు పిలిచాడు. హిజాబ్ గురించి అడిగాడు. గొడవ పెట్టుకున్నాడు. చుట్టుపక్కలి వాళ్లను పిలిచి మరీ విషయం చెప్పాడు. జనం మెల్లిమెల్లిగా వారిని చుట్టుముడుతూ ఉన్నారు. పరిస్థితి చెయ్యిదాటుతోందని గుర్తించిన ఆ అమ్మాయిలు అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు.


ఆ మగాళ్లు మాత్రం వదల్లేదు. వారిని తోసుకుంటూ వెళ్లారు. అలా ఆ అమ్మాయిలను తోసుకుంటూ షట్టర్ కిందకు తీసుకెళ్లారు. ఆ షెట్టర్ కింద వారిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆ మగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిగత్ అబ్బాస్ అనే యువతి స్పందిస్తూ.. ‘ పాకిస్తాన్‌లో ఆడవాళ్లకు రక్షణ ఉందా. పట్ట పగలు, మార్కెట్‌లో ఇదీ పరిస్థితి. ఇదే నిర్మానుష ప్రదేశం అయితే, పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది ఈ సంఘటనను తప్పుబడుతున్నారు.


ఇవి కూడా చదవండి

చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు..

Updated Date - Jun 05 , 2025 | 08:15 PM