Viral Escape Video: ఈమె ఎవరో స్పైడర్ మ్యాన్ సోదరిలా ఉంది.. 10వ అంతస్తు నుంచి..
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:41 AM
హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలాంటి సంఘటన ఒకటి చైనాలో చోటుచేసుకుంది. ఓ యువతి 10 అంతస్తుల బిల్డింగ్ మీద పెద్ద సాహసమే చేసింది. ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. హీరోలు పెద్ద పెద్ద భవంతుల మీద నుంచి కిందకు దూకటం.. ఇటు నుంచి అటువైపు ఎగరటం వంటివి చేస్తూ ఉంటారు. నిజ జీవితంలో ఇలాంటివి చేయటం అసాధ్యం. కానీ, అత్యంత అరుదుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఉండే లాంటి యాక్షన్ సీన్లు నిజ జీవితంలోనూ వెలుగుచూస్తూ ఉన్నాయి. కొంతమంది తమ ప్రాణాలకు తెగించి మరీ సాహసాలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా, ఓ యువతి 10 అంతస్తుల బిల్డింగ్ మీద పెద్ద సాహసమే చేసింది. ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్‌కు వెళ్లింది.
ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పని మనిషితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఓ రోజు పని మనిషితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి భార్య ఇంటికి వచ్చింది. దీంతో భయపడిపోయిన భర్త పని మనిషిని అక్కడినుంచి పంపాలని చూశాడు. వేరే దారి లేకపోవటంతో ఆమెను పదవ అంతస్తులోని ఫ్లాట్ కిటికీ నుంచి వెళ్లిపోమన్నాడు. ఇక, చేసేదేమీ లేక ఆమె కిటికీ నుంచి కిందకు దిగింది. కొద్దిసేపు ఆ వ్యక్తితో మాట్లాడింది. ఆ తర్వాత అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఆమె కిందకు దిగి వేరే ఫ్లాట్ దగ్గరకు వెళ్లింది. అక్కడున్న ఓ వ్యక్తి ఆమెను కిటికీ నుంచి పైకి లాగాడు. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఆమె క్షేమంగా అక్కడినుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈమె స్పైడర్ మ్యాన్ చెల్లెలిలా ఉంది’..‘ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పని మనిషిని కాపాడిన వ్యక్తే.. ఆమె ప్రియుడి భార్యకు ఎఫైర్ గురించి చెప్పి ఉంటాడు’..‘ఆమెకు చాలా అనుభవం ఉన్నట్లు ఉంది. అందుకే అంత ఈజీగా అటు, ఇటు గెంతుతూ ఉంది’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భారతీయుల వద్ద 35000 టన్నుల పసిడి