India Gold Reserves: భారతీయుల వద్ద 35000 టన్నుల పసిడి
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:30 AM
ధరలు చుక్కలంటుతున్నా సరే... దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి భారతీ య కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న...
ప్రస్తుత మార్కెట్ విలువ రూ.342 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ధరలు చుక్కలంటుతున్నా సరే... దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి భారతీ య కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న పసిడి నిల్వలు 34,600 టన్నులకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లని (సుమారు రూ.342 లక్షల కోట్లు) మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తు త దేశ జీడీపీలో ఇది 88.8 శాతానికి సమానం.
మారుతున్న ట్రెండ్: గతంలో దేశీయ కుటుంబాలు నగ నట్రా రూపంలోనే బంగారం కొనేవారు. ఇప్పటికీ దేశంలో అమ్ముడయ్యే బంగారంలో నాలుగింట మూడు వంతులు నాణేలు, కడ్డీల రూపంలోనే అమ్ముడవుతోంది. మిగతా మూడో వంతు మాత్రమే పెట్టుబడి లాభాల కోసం కొనే వారు కొంటున్నారు. గత ఏడాది కాలంలో బులియన్ మార్కెట్ ముఖ్యం గా పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై శాతానికిపైగా లాభాలు పంచింది. దీంతో ఇటీవల ఈ తరహా అమ్మకాలు మరింత పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎ్‌ఫలు, మల్టీ అసెట్స్ ఫండ్స్ పేరుతో ప్రత్యేక పథకాల ప్రారంభించి పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తున్నాయి.
ఆభరణాలు వేస్ట్: పెట్టుబడి లాభాల కోసమైతే ఆభరణాల రూపంలో బంగారం కొనడం వృఽధా అని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదిలో తెలిపింది. ఈ నగల్లో 30 నుంచి 35 శాతం విలువకు రాళ్లు, రత్నాలే ఉంటాయి. తరుగు, తయారీ చార్జీలు అదనం. పసిడి ధర ఏటా కనీసం 30ు చొప్పున పెరిగితేగానీ ఆభరణాల పెట్టుబడులపై లాభాలు రావు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి లాభాల కోసం చూసే వారు ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ ల్లో మదుపు చేయడం మంచిదని ఇన్వె్‌స్టమెం ట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి