Green Tea: గ్రీన్ టీ తాగిన అమ్మాయికి షాకింగ్ అనుభవం.. అసలేం జరిగిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:20 PM
శీతల పానీయాలు, ప్యాక్ చేసిన పానీయాలలో కీటకాలు కనిపించడం గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ యువతి తన షాకింగ్ అనుభవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవలి కాలంలో చాలా మంది ఇంట్లో కూర్చునే బయటి నుంచి ఆహారం (Food) తెప్పించుకుంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం ఎంత ప్రమాదకరం అనేది తెలిసిందే. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన పానీయాలలో కీటకాలు కనిపించడం గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ యువతి తన షాకింగ్ అనుభవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువతి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా గ్రీన్ టీ (Green Tea)కి ఆర్డర్ ఇచ్చింది. గ్రీన్ టీ క్యాన్ ఇంటికి వచ్చింది. గ్రీన్ టీని తాగేసి క్యాన్‌లో చూసిన యువతికి దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే ఆ క్యాన్‌లో ఓ చిన్న ఎలుక (Mice) కనిపించింది. ఆ క్యాన్‌లో ఎలుక సజీవంగా ఉంది. అది కదులుతోంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ యువతి ఆ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 47 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ వీడియోలో యువతిది నకిలీ ఆరోపణ అయి ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. అది నిజమైతే అది చాలా దారుణం అనుభవం అని మరికొందరు పేర్కొన్నారు. మీకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు, కచ్చితంగా డాక్టర్ చేత చెకప్ చేయించుకోండి అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..
ఈ ఫోటోలో Nల మధ్యలో కొన్ని Mలు కూడా ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..