Share News

Mestri miracle work: ఓర్నీ.. ఇలా చేశావేందయ్యా.. ఈ తలుపును ఎలా తెరవాలి స్వామీ..

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:40 PM

కొందరు వ్యక్తులు అనుకోకుండా చేసే తప్పులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ మేస్త్రి చేసిన పనికి సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mestri miracle work: ఓర్నీ.. ఇలా చేశావేందయ్యా.. ఈ తలుపును ఎలా తెరవాలి స్వామీ..
mestri miracle work

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు అనుకోకుండా చేసే తప్పులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ మేస్త్రి చేసిన పనికి సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (amazing mestri skills).


sameer_patel_0002 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కొత్తగా కడుతున్న ఇంటికి అమర్చిన తలుపును చూపిస్తున్నాడు. ముందుగా అతడు తలుపునకు ఉన్న గొళ్ళెం వైపు చూపించి తెరవడానికి ప్రయత్నించాడు, కానీ అది తెరుచుకోదు. ఆ తర్వాత గొళ్ళెం లేని వైపు లోపలికి తోస్తే ఆశ్చర్యకరంగా అది తెరుచుకుంది. దీంతో ఆ వ్యక్తి మేస్త్రి పనితనంపై జోకులు వేశాడు. ఒక దొంగను గందరగోళపరిచేందుకు మేస్త్రి ఇలా చేశాడని ఆ వ్యక్తి సరదాగా చెబుతున్నాడు (Funny construction work).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (viral mestri clip). ఆ వీడియోను లక్షల మంది వీక్షించారు. 8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ మేస్త్రి ప్రేమలో ఉన్నట్టున్నాడని ఒకరు కామెంట్ చేశారు. ఈ తలుపు తెరవడం సాధారణ దొంగకు సాధ్యం కాదని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..


పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 25 , 2025 | 03:40 PM