కదిలే యంత్ర జీవులు...
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:26 AM
ఏనుగు, సాలెపురుగు, ఆక్టోపస్, ఎండ్రికాయ... అన్నీ భారీగానే. ఆ ప్రాంగణంలో ఇలాంటి జీవులు చాలానే కనిపిస్తాయి. ఫ్రాంకోయిస్ డెలారోజియర్, పియరీ ఒరెఫైస్ అనే కళాకారులు యంత్రాలతో రూపొందించిన యాంత్రిక జీవులివి. వృథాగా పారేసిన రకరకాల యంత్రాల విడిభాగాలతో ఇలాంటి అనేక కదిలే జీవుల ఆకారాలను రూపొందించడం వారికి సరదా.

విశేషం ఏమిటంటే... ఆయా జీవులు ఎలా కదులుతాయో, అచ్చంగా అలాగే యంత్రాలతో నడిపించడం వీరి ప్రత్యేకత. అంటే... అచ్చంగా ఏనుగే నడిచివస్తున్నట్టుగా, ఆక్టోపస్ నెమ్మదిగా కదులుతున్నట్టుగా ఉంటాయన్నమాట. ఫ్రాన్స్‌లోని నాంటెస్‌లో ఉన్న ‘లెస్ మెషీన్స్ డి ల్లె’ పారిశ్రామిక కేంద్రంలో ఈ యాంత్రిక జీవులు కనువిందు చేస్తుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
Read Latest Telangana News and National News