Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయల సమాధిపై నీచమైన పని.. బుద్ధి లేదా మీకు..
ABN , Publish Date - Apr 21 , 2025 | 07:44 PM
Sri Krishnadevaraya Tomb: 64 పిల్లర్లతో ఆ మండం అద్భుతంగా ఉంటుంది.. ఈ 64 పిల్లర్లు చదరంగంలోని 64 పావులకు గుర్తులు. జీవితం అనే చదరంగంలో అందరం పావులమే అన్న ఉద్దేశ్యంతో ఆయన సమాధిని నిర్మించారు. అలాంటి ఆయన సమాధిని స్థానికులు మేకల మార్కెట్‌గా మార్చేశారు.
దేశం గర్వంగా చెప్పుకునే గొప్ప రాజుల్లో శ్రీ కృష్ణదేవరాయలు ముందు వరుసలో ఉంటారు. ఆయన ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన్ని అనెగొందిలో సమాధి చేశారు. తుంగభద్రానది ఒడ్డున దేవరాయల వారి సమాధి మండపం ఉంది. 64 పిల్లర్లతో ఆ మండపం అద్భుతంగా ఉంటుంది. ఈ 64 పిల్లర్లు చదరంగంలోని 64 పావులకు గుర్తులు. జీవితం అనే చదరంగంలో అందరం పావులమే అన్న ఉద్దేశ్యంతో ఆయన సమాధిని నిర్మించారని చెబుతారు. తాజాగా, కొంతమంది దుర్మార్గులు శ్రీ కృష్ణదేవరాయల సమాధిపై నీచమైన పని చేశారు.
ఆయన్ని గౌరవించుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరించారు. ఏకంగా సమాధిపైనే మేక మాంసాన్ని కోశారు. ఓ వ్యక్తి దాన్నంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం కర్ణాటక వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సమాధిపై మేకను కోసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ అది విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయల వారి సమాధి. ఆయన కన్నడా దేశానికి గర్వకారణం.
అలాంటి ఆయన సమాధిని స్థానికులు మేకల మార్కెట్‌గా మార్చేశారు. ఇది అత్యంత అవమానకరమైన విషయం. పురావస్తు శాఖ హిందూ దేవాలయాలను కూల్చిన ఔరంగజేబు సమాధిని రక్షిస్తోంది. ఔరంగజేబు వేల మంది హిందువులను చంపేశాడు. దేశ సంపదను లూటీ చేశాడు. ప్రజల్ని నిలువునా దోచుకున్నాడు. కానీ, విజయనగర సామ్రాజ్యం కీర్తిన ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ కృష్ణ దేవరాయల సమాధిని మాత్రం పట్టించుకోవటం లేదు’ అంటూ మండిపడ్డారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మీరు చెప్పింది నిజం ఎమ్మెల్యే గారు. ఔరంగజేబు సమాధిని కాపాడుతున్నారు. శ్రీ కృష్ణ దేవరాయల సమాధిని మాత్రం పట్టించుకోవటం లేదు‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Pope Francis: పోప్ మరణం.. ఆ ఉంగరం ప్రత్యేకత ఏంటో తెలుసా..
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం