Massive Brawl Over Chicken: చికెన్ ముక్కల కోసం గొడవ.. ఓడలో పొట్టుపొట్టుకున్న ప్రయాణికులు..
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:02 PM
Massive Brawl Over Chicken: చికెన్ విషయంలో ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు.
మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రతీ రోజూ మాంసం తినడానికి ఇష్టపడతారు. కానీ, విదేశాల్లో ప్రతీ రోజూ.. కుదిరితే ప్రతీ పూట మాంసం తినే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ రోజు మాంసం తినకపోతే పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తారు. మాంసం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ఓడలో చికెన్ కోసం పెద్ద గొడవైంది. కొంతమంది ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం కార్నివాల్ క్రూయిస్ షిప్ మియామి వెళుతోంది. భోజనం సమయంలో చికెన్ విషయంలో ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ప్రయాణికులు దారుణంగా కొట్టుకోవటం మొదలెట్టారు. పిడికిళ్లతో ఒకరిపై ఒకరు విచాక్షణా రహితంగా దాడి చేసుకోసాగారు. ఈ గొడవలో మహిళలు కూడా భాగమయ్యారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే..
ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే.. మిగిలిన వాళ్లు ఆపడానికి ప్రయత్నించలేదు. ఫోన్లలో వీడియో తీస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ గొడవపడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించాడు. అయినా వాళ్లు ఆగలేదు. దీంతో అతడు పక్కకు వచ్చాడు. వాకీటాకీ ద్వారా మిగిలిన వాళ్లకు సమాచారం ఇచ్చాడు. కొన్ని నిమిషాల పాటు గొడవ నడిచింది. తర్వాత దానంతట అదే ఆగిపోయింది. ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
తాజ్ మహాల్‌లోని రహస్య గదిలోకి వ్యక్తి.. అక్కడ ఏముందంటే..
ప్రియురాలిని చంపి.. శరీరాన్ని ముక్కలు, ముక్కలు చేసి..