Taj Mahal Viral Footage: తాజ్ మహాల్‌లోని రహస్య గదిలోకి వ్యక్తి.. అక్కడ ఏముందంటే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:31 PM
Taj Mahal Viral Footage: ఓ వ్యక్తి సాహసం చేశాడు. అనుమతి లేకుండా నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లాడు. వెళ్లటమే కాకుండా దాన్నంతా వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
ప్రేమకు చిహ్నమైన కట్టడం ఏది అని ఎవరినైనా అడిగితే.. ఠక్కున తాజ్ మహాల్ పేరు చెబుతారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ మీద ప్రేమతో తాజ్ మహాల్ కట్టించాడని అంటారు. ప్రేమకు చిహ్నమైన ఆ పాలరాతి కట్టడం ప్రపంచ వింతల్లో కూడా చోటు దక్కించుకుంది. యమునా నది తీరంలో ఉన్న తాజ్ మహాల్‌లో అంతుచిక్కని మిస్టరీలు చాలా ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు తాజ్ మహాల్ చూడ్డానికి వెళతారు. అయితే, వారికి తాజ్ మహాల్ లోపల కొంతవరకు మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది.
మిగిలిన ప్రాంతాల్లోకి వెళ్లటం నిషిద్ధం. ఆ నిషిద్ధ ప్రదేశాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఓ వ్యక్తి సాహసం చేశాడు. అనుమతి లేకుండా నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లాడు. వెళ్లటమే కాకుండా దాన్నంతా వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో ఏముందంటే.. ఆ వ్యక్తి మెట్ల మార్గం ద్వారా లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు.
అలా మెట్ల ద్వారా లోపలికి వెళ్లగా.. అక్కడ ఓ గది ఉంది. ఆ గదిలో రెండు సమాధులు దర్శనమిచ్చాయి. ఆ రెండు సమాధుల్లో ఒకటి పెద్దగా ఉంది. రెండోది చిన్నగా ఉంది. చిన్న సమాధి గదిలో మధ్యలో ఉంది. దానిపై ఓ తీగ వేలాడుతూ ఉంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నేను 1994లో తాజ్ మహాల్ చూడ్డానికి వెళ్లాను. ఆ సమయంలో ఈ రెండు సమాధులు చూడ్డానికి అవకాశం ఉండేది. మేము కూడా చూశాం’..‘నేను అక్కడ దెయ్యం ఉంటుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆధార్ ఆధారంగా బీహార్ ఓటర్ల జాబితా..సుప్రీంకోర్టు కీలక తీర్పు
కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం