Share News

Funny Jugaad video: ఇదెక్కడి ట్రిక్ బాసూ.. హెల్మెట్ లేకపోవడంతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Oct 27 , 2025 | 03:54 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Funny Jugaad video: ఇదెక్కడి ట్రిక్ బాసూ.. హెల్మెట్ లేకపోవడంతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..
unbelievable jugaad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Indian creativity).


@Pra7oel అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (innovative ideas). 'మీ దగ్గర హెల్మెట్ లేకపోతే, మీరు పాత విరిగిన టీవీతో సరిపెట్టుకోవచ్చు' అని వీడియోకు క్యాప్షన్‌గా పెట్టారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ మీద కూర్చుని టీవీని తలపై హెల్మెట్‌లా పెట్టుకున్నాడు. ఆ టీవీ ఫ్రేమ్ లోపల ఏమీ లేదు. ఆ ఫ్రేమ్‌ లోపల తన తలను పెట్టి దానిని హెల్మెట్‌లా ఉపయోగించాడు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ఆ వీడియోను రూపొందించినట్టు అర్థమవుతోంది (TV helmet).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (desi hacks). ఈ వైరల్ వీడియోను దాదాపు 1.5 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ టెక్నాలజీ మన దేశం దాటి వెళ్లకూడదని ఒకరు కామెంట్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ హెల్మెట్ మరింత పెద్ద ఇబ్బందులు కలిగిస్తుందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Cream biscuits: మీ పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లు తింటుంటారా.. ముందు ఈ విషయం తెలుసుకోండి..


Optical Illusion Test: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ గదిలో దాక్కున్న కప్పను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 27 , 2025 | 04:11 PM