shocking viral news: గర్ల్‌ఫ్రెండ్ కోసం సర్జరీ చేయించుకున్నాడు.. చివరకు అతడి పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:14 AM
తాజాగా చైనాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రేయసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేందుకు ఓ వ్యక్తి శస్త్ర చికిత్సకు కూడా రెడీ అయ్యాడు. చివరకు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రేయసి కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వారి తల్లిదండ్రులను కూడా ఇంప్రెస్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సాహసాలు చేసేందుకు రెడీ అవుతారు. తాజాగా చైనాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రేయసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేందుకు ఓ వ్యక్తి శస్త్ర చికిత్సకు కూడా రెడీ అయ్యాడు. చివరకు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు (viral relationship story).
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల లి జియాంగ్ ఊబకాయం, ఆధికంగా ఆహారం తినడం అనే రుగ్మతలతో బాధపడుతున్నాడు. 134 కిలోల కంటే ఎక్కువ బరువుతో ఉండే అతడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమె కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు అర్జంటుగా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులు వ్యాయామం, డైటింగ్ చేశాడు. అయితే ఫలితం రాలేదు (weight-loss surgery story).
సహజ పద్ధతుల ద్వారా బరువు తగ్గడం కుదరలేదని గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నాడు (transformation story). జెంగ్‌జౌలోని పీపుల్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. వైద్యులు అతడికి విజయవంతంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. అనంతరం అతడిని జనరల్ వార్డుకు తరలించారు. తర్వాతి రోజు అతడి పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. మరుసటి రోజు ఉదయం అతడి శ్వాస ఆగిపోయింది. శ్వాసకోశ వైఫల్యం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యుల ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా శోధించకుండానే డాక్టర్లు సర్జరీ చేసేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పిల్లిని మింగుతున్న కొండచిలువ.. తర్వాతేం జరిగిందంటే..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలోని రెండో వ్యక్తిని 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..