unbelievable trick: సూపర్ ట్రిక్.. తాళం లేకుండానే లాక్ ఎలా తీశాడో చూడండి..
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:30 PM
సాధారణంగా మన ఇంటికి వేసుకుని తాళం ఎక్కడైనా పోతే తాళం కప్పను తెరవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. తాళం కప్పను పగలగొట్టడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తాళం కప్పను దీపావళి టపాసుల సహాయంతో చాలా సులభంగా తెరిచేశాడు.
సాధారణంగా మన ఇంటికి వేసుకునే తాళం ఎక్కడైనా పోతే తాళం కప్పను తెరవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. తాళం కప్పను పగలగొట్టడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తాళం కప్పను దీపావళి టపాసుల సహాయంతో చాలా సులభంగా తెరిచేశాడు. ఆ ట్రిక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (lock breaking story).
vickysinghexperiments అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. దీపావళికి కాల్చే చిచ్చుబుడ్డి సహాయంతో ఒక వ్యక్తి తాళం కప్పను అన్‌లాక్ చేశాడు. చిచ్చుబుడ్డిని పట్టుకారు సహాయంతో పట్టుకుని దాని నుంచి వచ్చే నిప్పు రవ్వలు తాళం కప్పకు తగిలేలా ఉంచాడు. దాదాపు 17 సెకెన్ల తర్వాత ఆ తాళం కప్ప అన్‌లాక్ అయింది. ఈ ట్రిక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
ఈ వీడియోను మూడు కోట్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు (Un lock Trick). దాదాపు 2.8 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. చాలా మంది ఇది సూపర్ ట్రిక్ అని అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకర ట్రిక్ అని హెచ్చరించారు. ఇళ్లు, గొడౌన్ల తాళాలను ఇలా తెరవడం ప్రమాదకరం అని సూచించారు. దొంగలకు ఈ ట్రిక్ పని చేయదని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
shocking incident: వామ్మో.. కుక్కర్‌ను అలా ఓపెన్ చేస్తే పేలిపోతుందా? షాకింగ్ వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..