Share News

Train bathing video: ఇదేం పని భయ్యా.. రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా? వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:28 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.

Train bathing video: ఇదేం పని భయ్యా.. రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా? వీడియో వైరల్..
man bathes on train

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (man bathes on train).


moth_comedy_video అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కదులుతున్న రైలులో ఒక వ్యక్తి రెస్ట్‌రూమ్ వెలుపల బకెట్‌లో నీరు నింపుకుని స్నానం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వ్యక్తి షార్ట్స్ ధరించి గ్లాసుతో బకెట్ నుంచి నీటిని తీసుకొని స్నానం చేస్తున్నాడు. ఆ తర్వాత సబ్బు కూడా రుద్దుకుంటున్నాడు. కోచ్‌లోని ప్రతి ఒక్కరూ అతడిని వింతగా చూస్తున్నారు. అయినా అతడు మాత్రం తను చేస్తున్న పని ఆపలేదు (Indian Railways incident).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది (viral train video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు. 1.3 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ప్రజా స్థలాన్ని ఇలా దుర్వినియోగం చేయడం నేరం అని కొందరు కామెంట్లు చేశారు. సాటి ప్రయాణికులకు ఇలా అసౌకర్యం కలిగించినందుకు అతడిని శిక్షించాలని చాలా మంది డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 08 , 2025 | 07:22 PM