Share News

Helmet fine video: హెల్మెట్ లేకుండా దొరికిపోయిన బైకర్.. చివరకు ట్రాఫిక్ పోలీస్ దండం పెట్టి..

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:08 PM

ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను తనిఖీ చేస్తూ హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కలిగిస్తున్నారు. అయినా చాలా మంది హెల్మెట్ ధరించకుండా వెళ్లడానికే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.

Helmet fine video: హెల్మెట్ లేకుండా దొరికిపోయిన బైకర్.. చివరకు ట్రాఫిక్ పోలీస్ దండం పెట్టి..
traffic rules India

బైక్‌ల మీద ప్రయాణించే అందరూ హెల్మెట్ ధరించి తీరాల్సిందేనని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను తనిఖీ చేస్తూ హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కలిగిస్తున్నారు. అయినా చాలా మంది హెల్మెట్ ధరించకుండా వెళ్లడానికే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా ఓ ట్రాఫిక్ పోలీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (traffic police viral video).


vivekanandtiwarithetrafficcop అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. హెల్మెట్‌ ఎక్కడ అని అడిగితే.. ఆ బైకర్ నవ్వుతూ 'సర్.. నా తల సైజు హెల్మెట్ లేదు' అని చెప్పాడు. అతడి మాటలను ట్రాఫిక్ పోలీసు నమ్మలేదు. తన సొంత హెల్మెట్ తీసి సదరు బైకర్ తలపై పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ హెల్మెట్ అతడికి కొంచెం కూడా సరిపోలేదు. అది చూసి, అక్కడ ఉన్నవారు అందరూ నవ్వుకున్నారు (policeman pleads with rider).


ట్రాఫిక్ పోలీస్‌ కూడా నవ్వుతూ హెల్మెట్ కంపెనీలకు ఓ రిక్వెస్ట్ చేశాడు (viral cop video). ఇలాంటి భారీ శరీరం కలిగిన వ్యక్తులకు సరిపడే సైజులో కూడా హెల్మెట్లు తయారు చేయాలని కోరుతూ కంపెనీలను అభ్యర్థించాడు. తన రెండు చేతులను జోడించి.. ప్రతి సైజులో హెల్మెట్లు తయారు చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొన్ని కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 14 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 15 , 2025 | 05:39 PM