Share News

Indian jugad: ఈ తెలివికి నోబెల్ ఇవ్వాల్సిందే.. సీలింగ్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..

ABN , Publish Date - Nov 04 , 2025 | 06:41 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Indian jugad: ఈ తెలివికి నోబెల్ ఇవ్వాల్సిందే.. సీలింగ్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..
ceiling fan modification

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (funny viral video).


hansi.kathela అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌ను, స్టాండ్ ఫ్యాన్‌గా మార్చేశాడు. స్టాండ్ ఫ్యాన్‌కు సీలింగ్ ఫ్యాన్‌ను అమర్చాడు. కరెంట్ స్విచ్ ఆన్ చేయగానే ఆ ఫ్యాన్ చక్కగా తిరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ట్రిక్ చేసిన వ్యక్తిని సోషల్ మీడియా యూజర్లు అభినందిస్తున్నారు (ceiling fan hack).


ఈ వైరల్ వీడియోను వందల మంది వీక్షించారు. ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు (ceiling fan modification). ఈ ట్రిక్ చేసిన వ్యక్తి ఎలక్ట్రీషియన్ ప్రో మ్యాక్స్ అని ఒకరు ప్రశంసించారు. ఇది చాలా ప్రమాదం కలగచేయవచ్చని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రీల్ కోసం రూపొందించిందని, దీని వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

కెనడాలో విచిత్రమైన కప్ప.. నోటిలో కళ్లు.. కారణమేంటంటే..

మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని రెండు తేడాలను 27 సెకెన్లలో కనిపెట్టండి



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 04 , 2025 | 06:42 PM