Flood survival Video: కరెంట్ స్థంభం ఎంత సహాయపడింది.. ఓ వ్యక్తిని వరద నుంచి కాపాడింది..
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:48 PM
వర్షాకాలంలో కొండ ప్రాంతాల వారి పరిస్థితి భయానకంగా ఉంటుంది. అకస్మాత్తుగా సంభవించే వరదలు వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
వర్షాకాలంలో కొండ ప్రాంతాల వారి పరిస్థితి భయానకంగా ఉంటుంది. అకస్మాత్తుగా సంభవించే వరదలు వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా డెహ్రాడూన్‌లోని సహస్రధారలో క్లౌడ్ బరస్ట్ భయానక పరిస్థితిని సృష్టించింది. అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నో గ్రామాలను వరద ముంచెత్తింది (Man climbs electric pole).
ఈ అకస్మాత్తు వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఓ వ్యక్తి వరద నుంచి తనను తాను రక్షించుకునేందుకు కరెంట్ స్థంభం ఎక్కి కూర్చున్నాడు (flood rescue india). డెహ్రాడూన్‌లోని ఆ ప్రదేశంలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి అక్కడ చిక్కుకున్నాడు. తనను తాను రక్షించుకోవడానికి వేరే మార్గం లేక, అతను అక్కడ కనిపించే విద్యుత్ స్థంభాన్ని ఎక్కాడు (Shocking flood escape).
ఆ కరెంట్ స్థంభం కూడా చాలా వరకు నీటిలో మునిగిపోయింది (Extreme survival story). ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న వంతెనలో ఒక భాగం విరిగి కొట్టుకుపోయింది. అలాగే డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది.
ఇవి కూడా చదవండి..
వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..
మీ దృష్టికి పరీక్ష.. ఈ బెడ్రూమ్‌లో సీతాకోకచిలుక ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..