Share News

Fire Video: చిన్న పిల్లాడే కానీ, ఎంత ధైర్యవంతుడో చూడండి.. వీడియో చూస్తే మెచ్చుకోవాల్సిందే..

ABN , Publish Date - May 28 , 2025 | 07:51 PM

ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదరైనప్పుడు చాలా ధైర్యంగా ఆలోచించి స్పందించేవాడే దాని నుంచి బయటపడతాడు. లేకపోతే ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ ఐదేళ్ల కుర్రాడు ప్రమాదం ఎదురైనపుడు స్పందించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Fire Video: చిన్న పిల్లాడే కానీ, ఎంత ధైర్యవంతుడో చూడండి.. వీడియో చూస్తే మెచ్చుకోవాల్సిందే..
Little boy saves his younger sister from fire

ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదరైనప్పుడు చాలా ధైర్యంగా ఆలోచించి స్పందించేవాడే దాని నుంచి బయటపడతాడు. లేకపోతే ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ ఐదేళ్ల కుర్రాడు (Little boy) ప్రమాదం ఎదురైనపుడు స్పందించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ కుర్రాడు ప్రమాదం నుంచి తన చిన్న చెల్లిని రక్షించిన తీరు అద్భుతంగా ఉంది. ఆ ఘటన ఆ గదిలో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు తన మంచం మీద పడుకుని తన చెల్లెలితో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా గదిలో మంటలు (Fire) చెలరేగాయి. మంచం పక్కన ఉన్న అల్మారాలో వేలాడుతున్న బట్టలు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. ఆ మంటను చూసిన పిల్లవాడు భయపడడానికి బదులుగా చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. వెంటనే ఆ గది నుంచి బయటకు పరిగెత్తి మంటలను ఆర్పే రసాయనాన్ని తీసుకువచ్చాడు. దాన్ని స్ప్రే చేసి వెంటనే ఆ మంటలను అదుపు చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ఆ ఘటన ఆ గదిలో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ కుర్రాడు చాలా తెలివిగా ఆలోచించాడని ఒకరు కామెంట్ చేశారు. ఈ చిన్నారి ఆలోచన, తెలివితేటలకు సెల్యూట్ అంటూ మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

Jugaad Video: వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్

మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2025 | 07:51 PM