Share News

Lioness vs elephant: ఆ సమయంలో ఏనుగులు చాలా డేంజర్.. సింహాలు ఎలా పరిగెత్తాయో చూడండి..

ABN , Publish Date - Nov 27 , 2025 | 03:53 PM

జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు, సింహాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Lioness vs elephant: ఆ సమయంలో ఏనుగులు చాలా డేంజర్.. సింహాలు ఎలా పరిగెత్తాయో చూడండి..
trending wildlife clip

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు, సింహాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (wildlife encounter).


wildfriends_africa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రెండు సింహాలు ఒక జంతువును వేటాడి చెట్టు వెనుక కూర్చుని తింటున్నాయి. అక్కడకు ఒక ఏనుగు వచ్చింది. ముందుగా సింహం లేచి నిలబడి తన ప్రతాపం చూపించడానికి ప్రయత్నించింది. అయితే ఎదురుగా ఉన్న ఏనుగుతో పోరాడి గెలవడం కష్టమని గ్రహించిన సింహం తన భాగస్వామితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (lioness running).


'పిల్లలు సమీపంలో ఉన్నప్పుడు ఏనుగు ఆ ప్రాంతంలోకి ఏ చొరబాటుదారుడినీ సహించదు. అది సింహం అయినా, చిరుతపులి అయినా, హైనా అయినా ఏనుగు అంగీకరించదు. ఎట్టి పరిస్థితులలోనూ తన పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆ సమయంలో ఏనుగులతో పోరాడడం డేంజర్' అని పై వీడియోను (safari video) షేర్ చేసిన హ్యాండిల్‌‌లో పేర్కొన్నారు. కాగా, పై వీడియోలో ఏనుగు తన బలాన్ని ప్రదర్శించగా, సింహం తెలివిగా వ్యవహరించిందని నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2025 | 06:24 PM