Lion Video: నిద్రిస్తున్న కార్మికుడి దగ్గరకు వెళ్లిన సింహం.. తర్వాతేం జరిగిందంటే.. థ్రిల్లింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:43 PM
మీరు గాఢ నిద్రలో ఉన్నారు.. మీరు కళ్లు తెరిచే సరికి అతి దగ్గరగా ఓ భారీ సింహం నిలబడి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మీరేం చేస్తారు? తాజాగా గుజరాత్‌లోని ఓ కార్మికుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరు గాఢ నిద్రలో ఉన్నారు.. మీరు కళ్లు తెరిచే సరికి అతి దగ్గరగా ఓ భారీ సింహం (Lion) నిలబడి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మీరేం చేస్తారు? తాజాగా గుజరాత్ (Gujarat)లోని ఓ కార్మికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిర్మాణంలో ఉన్న ఓ భవంతి పై కప్పుపై నిద్రిస్తున్న కార్మికుల దగ్గరకు రెండు సింహాలు వెళ్లి కళ్లు చెదిరే షాకిచ్చాయి. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ (Viral video)గా మారింది.
@AnandVirSingh12 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. గుజరాత్‌లోని గిర్ అడవికి దగ్గరగా ఉన్న అమ్రేలి జిల్లాలోని ధారి ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు మీద కొంతమంది కార్మికులు హాయిగా నిద్రపోతున్నారు. కింద నుంచి రెండు సింహాలు ఆ భవనం పైకి ఎక్కాయి. ఒక సింహం నేరుగా నిద్రిస్తున్న కార్మికుడి దగ్గరకు వెళ్లి అతడిని వాసన చూసింది. అతడి చుట్టూ తిరిగింది. కానీ, అతడిపై దాడికి మాత్రం పాల్పడలేదు.
కాసేపటికి ఆ వ్యక్తి లేచి తన ఎదురుగా ఉన్న సింహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడి నుంచి లేచి పరుగులు పెట్టాడు. ఆ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ అయి వైరల్ అవుతోంది. వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. అమ్రేలి జిల్లాలోకి సింహాలు జొరబడడం కొత్తేం కాదని ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియో నిజమైనదేనా అని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..