Share News

Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా డేంజర్.. దూరంగా ఉండండి..

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:42 PM

సమాజంలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ, అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొందరు మంచి వారు ఉంటారు.. కొందరు చెడ్డవారు ఉంటారు. అయితే, ఇలాంటి వారితో స్నేహం మాత్రం ఎప్పటికైనా డేంజర్.. వీరికి దూరంగా ఉండండి..

Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా డేంజర్.. దూరంగా ఉండండి..
Fake Freinds

Freindship: జీవితంలో స్నేహం ఒక ముఖ్యమైన సంబంధం. కానీ, ప్రతి ఒక్కరూ స్నేహానికి అర్హులు కాదు. ఎందుకంటే సమాజంలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ, అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొందరు మంచి వారు ఉంటారు.. కొందరు చెడ్డవారు ఉంటారు. కొన్నిసార్లు మన సన్నిహిత సంబంధాలు కూడా మనకు ద్రోహం చేస్తాయి. నేటి కాలంలో నిజమైన స్నేహితులనీ, అబద్ధపు స్నేహితులనీ వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మీ స్నేహితుడు తన స్వార్థం కోసం మీతో ఉన్నారా? లేక నీ సుఖ దుఃఖాలలో నిస్వార్థంగా నీకు అండగా ఉన్నాడా అనేది ఇలా తెలుసుకోండి..

1. మీ భావోద్వేగాలను గౌరవిస్తాడా..

నిజమైన స్నేహితుడు మీ భావోద్వేగాలను గౌరవిస్తాడు. మీ ఆనందం, దుఃఖంలో మీతో పాటు ఉంటాడు. కానీ, అలా కాకుండా మీ భావోద్వేగాలను విస్మరిస్తే, మీ విచారాన్ని తేలికగా తీసుకుంటే లేదా మీ సమస్యలను ఎగతాళి చేస్తే వారికి దూరంగా ఉండండి.. అలాంటి వారు స్నేహానికి పనికి రారు.

2. కష్ట సమయాల్లో మీతో ఉన్నాడా?

కష్ట సమయాల్లో నిజమైన స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. మీ స్నేహితుడు మంచి సమయాల్లో మాత్రమే మీతో ఉంటూ మీ కష్ట సమయాల్లో దూరంగా ఉంటే వారిని వదిలించుకోండి. ఇలాంటి వారు ఎప్పటికైనా మిమ్మల్ని మోసం చేశారు.


3. నిజాయితీ..

స్నేహంలో నిజాయితీ ఉండాలి. నిజమైన స్నేహితుడు మీకు అబద్ధాలు చెప్పడు. ఒక వ్యక్తి మీకు ఎప్పుడు తప్పుడు వాగ్దానాలు చేస్తూ, మీ ముందు ఒక లాగా మీ వెనుక మరొలా మాట్లాడటం లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తే అది మోసానికి సంకేతం. అలాంటి వారు ఎప్పటికైనా డేంజర్.. కాబట్టి, వారిని దూరం పెట్టండి..

4. మీ విజయంలో సంతోషం

నిజమైన స్నేహితుడు మీ విజయంలో గర్వపడతాడు. మీ ఆనందాన్ని పంచుకుంటాడు. కానీ, మీ స్నేహితుడు మీ విజయాలను చూసి అసూయపడి, మిమ్మల్ని ప్రశంసించడం కాకుండా మీ విజయాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే, అతను మీ శ్రేయస్సును కోరుకోవడం లేదనే సంకేతం.

5. మద్దతు..

నిజమైన స్నేహితుడు మీ తప్పులను సరిదిద్దడంలో మీకు సహాయం చేస్తాడు. కానీ, ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తే, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తే లేదా మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచేలా చేస్తే, ఈ స్నేహం మీకు సరైనది కాదు. అలాంటి వారికి దూరంగా ఉండండి..

Updated Date - Jan 18 , 2025 | 04:42 PM