Share News

Leopard vs hyena: చిరుత పులి ఎంతలా షాకైందో.. హైనాను చూసి చూసి ఎలా భయపడిందో చూడండి..

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:51 PM

వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి, హైనాకు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leopard vs hyena: చిరుత పులి ఎంతలా షాకైందో.. హైనాను చూసి చూసి ఎలా భయపడిందో చూడండి..
wildlife encounter

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి, హైనాకు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Leopard hyena video).


@AMAZlNGNATURE అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చిరుతపులి అడవిలో హాయిగా రిలాక్స్ అవుతూ కూర్చుని ఉంది. నిశ్చింతగా ఉంది. ఆ సమయంలో ఒక హైనా నిశ్శబ్దంగా చిరుత పులి వెనుకకు వచ్చి నిలబడింది. హైనా తన వెనుక ఉన్నట్టు ఆ చిరుతపులి గుర్తించ లేదు. హైనా కూడా ఎటువంటి శబ్దమూ చేయకుండా అలాగే నిలబడి ఉంది. కాసేపటికి యథాలాపంగా చిరుత వెనక్కి చూసి తుళ్లిపడింది (rare wildlife clip).


వెంటనే లేచి నిలబడి ఎటాకింగ్ మోడ్‌లోకి మారిపోయింది (shocking wildlife moment). కళ్లు పెద్దవిగా చేసి, గాండ్రిస్తూ హైనాను భయపెట్టడానికి ప్రయత్నించింది. సాధారణంగా హైనా కంటే చిరుతపులి శక్తివంతమైనది. చిరుతను హైనా ఒంటరిగా ఎదుర్కోలేదు. అయితే, హైనాలు ఎప్పుడూ గుంపులుగా నివసిస్తాయి. ఇతర జంతువులపై హైనాలు మూకుమ్మడి దాడికి పాల్పడతాయి. అందుకే హైనాలతో ఇతర జంతువులు ప్రత్యక్ష ఘర్షణకు దిగవు. తాజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2025 | 05:19 PM