Happy child video: సంతోషంగా ఎలా ఉండాలో ఈ పిల్లాడు నేర్పుతున్నాడు.. నెటిజన్లు ఫిదా..
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:16 PM
కొన్ని క్యూట్ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (heartwarming viral video).
@shutupari అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు చాలా క్యూట్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక పిల్లవాడు పాలిథిన్ సంచిని నీటితో నింపి దానిని ఓ కర్రకు వేలాడదీశాడు. దాని కింద నిలబడి తన శరీరానికి సబ్బు పూసుకున్నాడు. ఆ తర్వాత, ఆ కుర్రాడు చీపురుతో పాలిథిన్ సంచిని గుచ్చాడు. దీంతో పాలిథిన్ కవర్‌కు రంధ్రాలు పడి షవర్ నుంచి నీరు వస్తున్నట్టుగా ఆ కుర్రాడిపై పడింది. దాని కింద స్నానం చేసిన కుర్రాడు చాలా సంతోషపడ్డాడు (inspirational kid clip).
ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (happiness lesson). 12 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సంతోషంగా ఉండాలనుకునే వారు ఈ పిల్లవాడిలాగే తమ ఆనందాలను వెతుక్కోవాలని ఒకరు కామెంట్ చేశారు. 'మనం మళ్లీ పిల్లలుగా మారగలమా? నేను ఆ రోజులను కోల్పోతున్నాను'అని ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..