Tips To Clean Burnt Vessels : మీ పాత్రలు తెల్లగా మెరవాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:34 PM
మనం తరుచుగా వండుకునే పాత్రలు కొద్దికాలం తరువాత నల్లగా, జిడ్డుగా మారుతాయి. అటువంటి పాత్రలను శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Tips To Clean Burnt Vessels: వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పాత్రలు బాగా కాలిపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే అంత ఈజీ కాదు. కొన్ని సార్లు వంట పూర్తిచేసిన తరువాత పాత్రలను వెంటనే కడగడానికి కూడా వీలుకాకపోవచ్చు. అలా చేయడం వల్ల మీ పాత్రలపై జిడ్డు, నల్ల మరకలు పేరుకుపోతాయి. మీ వంటపాత్రలు కొత్త వాటి వలె తళ తళ మెరవాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి..
స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు
ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి. వాటిలో డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. స్క్రబ్బర్‌తో లిక్విడ్ ను తీసుకుని పాత్రలపై ఉండే మరకలను రుద్ది నీళ్లు పోసి కడగాలి.. ఒకవేళ స్టీల్ పాత్రల పై మాడిపోయిన మరకలు ఇంకా అలానే ఉంటే వీటిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లల్లో 1 చిన్న చెంచా వెనిగర్ కలపాలి. మాడిన మరకల పై డిష్ స్క్రబ్బర్‌ను ఉపయోగించి వెనిగర్ తో రుద్దాలి. దాని తరువాత బేకింగ్ సోడాను మాడినచోట కొంచెం చల్లి రుద్దాలి. తర్వాత పాత్రలను మంచి నీటితో కడిగాలి.
అల్యూమినియం పాత్రలు
మరకలను రుద్దడానికి డిష్ వాష్ లిక్విడ్ ఉపయోగించండి. అవి వదలకుండా ఉంటే, శుభ్రంగా ఉన్న పాత్రలో నీటిని పోసి మరిగించండి. మరిగిన నీటిని జాగ్రత్తగా ఒక బకెట్‌లో పోసి 2 చెంచాల నిమ్మ రసాన్ని కలపండి. అల్యమినియమ్ గిన్నెలను దానిలో వేసి అరగంట పాటు ఉంచండి. తర్వాత నీరు పారబోసి పాత్రలు చల్లబడేలా చూడండి. పాత్రలపై ఉన్న మరకలను డిష్ స్క్రబ్బర్‌తో తేలికగా శుభ్రపరచవచ్చు.
నాన్-స్టిక్ ప్యాన్లు
నాన్-స్టిక్ పాన్‌పై లోహపు స్క్రబ్బర్‌ని ఉపయోగించకండి. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ల పై మొండి మరకలు ఉంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 2 చెంచాల బేకింగ్ సోడాను కలుపుకుని బాగా కలియబెట్టండి. ఆ పేస్ట్ ను మరకల పై పూసి 20 నిమిషాలు అలానే ఉంచండి. ఒక 1 చిన్న చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్‌తో, ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళతో వాటిని శుభ్రపరచండి.
స్టీల్ కత్తులు
ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లుతీసుకోని అందులో అర చిన్న చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ కలుపుకోని అందులో మరకలు పట్టిన స్టీల్ కత్తులను నానబెట్టాలి. 30 నిమిషాల తరువాత వాటిని తీసి మంచి నీళ్లతో కడిగి మెత్తని బట్టతో తుడిచి ఆరబెట్టండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి.. వాళ్ళు కీడే కోరుకుంటారు..