‘కింగ్‌కాంగ్’ రికార్డు
ABN , Publish Date - Feb 23 , 2025 | 07:38 AM
‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు (రానా) ఒక అడవిదున్నతో తలపడే సీన్ గుర్తుండే ఉంటుంది కదా! స్ర్కీన్‌పై ఆ దున్న కనిపిస్తే కన్నార్పకుండా చూశారంతా! గ్రాఫిక్స్‌లో రూపొందించారు కాబట్టి దున్న అంత ఎత్తుతో, బలిష్ఠంగా ఉంది అనుకున్నారు.

‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు (రానా) ఒక అడవిదున్నతో తలపడే సీన్ గుర్తుండే ఉంటుంది కదా! స్ర్కీన్‌పై ఆ దున్న కనిపిస్తే కన్నార్పకుండా చూశారంతా! గ్రాఫిక్స్‌లో రూపొందించారు కాబట్టి దున్న అంత ఎత్తుతో, బలిష్ఠంగా ఉంది అనుకున్నారు. కానీ ఆ దున్నను తలదన్నే గేదె ఒకటి థాయ్‌లాండ్‌లో ఉంది. దాని పేరు ‘కింగ్‌కాంగ్’. ఆరడుగుల ఎత్తుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన కింగ్‌కాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడప్పుడు మంచి దిట్టంగా ఉన్న గేదెలను, బలిష్ఠంగా ఉండే ఒంగోలు గిత్తలను చూస్తూనే ఉంటాం. కానీ ఆరడుగులను మించి ఎత్తు ఉన్న గేదెను చూడాలంటే మాత్రం థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే. ఆరడుగుల ఎత్తు, బలిష్ఠమైన శరీరంతో ఉంటుంది ‘కింగ్‌కాంగ్’. అంత ఎత్తు ఉన్నా దాని వయసు మూడేళ్లే! థాయ్‌లాండ్‌లో నాఖోన్ రాట్చాసిమాలోని నిన్లానీ ఫామ్‌లో కింగ్‌కాంగ్ జన్మించింది. ‘‘గేదె పేరు కింగ్‌కాంగ్ అని యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. పుట్టినప్పుడు చూడగానే భారీగా ఎదుగుతుందని గుర్తించాం. అందుకే ఆ పేరు పెట్టా’’ అని అంటారు దాని యజమాని సుచార్ట్ భూన్‌చారెన్.
గిన్నిస్ రికార్డు
సాధారణ గేదెలతో పోలిస్తే కింగ్‌కాంగ్ 20 అంగుళాలు ఎక్కువ ఎత్తు ఉంది. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద గేదెగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ల్లో దాని పేరు నమోదయింది. కింగ్ కాంగ్ భారీ ఆకారం చూసి అందరూ భయపడతారు. దూకుడుగా ఉంటుందని అనుకుంటారు. కానీ అది చాలా స్నేహంగా, నమ్మకంగా ఉంటుంది. ‘‘కింగ్‌కాంగ్ చాలా విశ్వాసం కలది. చుట్టూ ఉన్న గేదెలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంది.
మనుషుల చుట్టూ పరుగెడుతుంది’’ అని ఫామ్‌లో పనిచేసే చెర్‌పాట్ట్ వుట్టి అంటారు. కింగ్‌కాంగ్ పోషణ ఆమెనే చూసుకుంటారు. అది కూడా ఆమెతో చాలా స్నేహంగా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో గేదెలకు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యంఉంది. వ్యవసాయం, రవాణా వంటి పనులలో ఈ గేదెలను ఉపయోగిస్తుంటారు. థాయ్‌లాండ్‌లో నీటి గేదెలు ఎక్కువగా కనిపిస్తాయి. మన దగ్గర ఉండే గేదెలతో పోలిస్తే నీటి గేదెలు ఎక్కువ ఎత్తు, బరువుతో దిట్టంగా ఉంటాయి.