king cobra in vault: ఈ డబ్బులను కాజేయడం ఎవరి తరమూ కాదు.. కోబ్రా సెక్యూరిటీ చూశారా..?
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:32 PM
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చేస్తాయి. ఇళ్లలోకి దూరిపోయి ప్రమాదాలకు కారణమవుతాయి.
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చేస్తాయి. ఇళ్లలోకి దూరిపోయి ప్రమాదాలకు కారణమవుతాయి. చెప్పుల్లోనూ, హెల్మెట్లలోనూ, దుప్పట్లలోనూ పాములు ఉంటున్న వీడియోలు ఇటీవలి కాలంలో తరచుగా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసే షాకవ్వాల్సిందే (snake guarding treasure).
@abhishek902444 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (gold vault snake). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లోకి పాము చొరబడింది. అయితే అది ఏకంగా ఆ ఇంటి బీరువా లాకర్‌లో దాక్కుని ఉంది. ఆ ఇంటి కుటుంబ సభ్యులు లాకర్ తెరిచి చూడగా అందులో పాము కనిపించింది. ఆ లాకర్‌లో డబ్బులతో పాటు బంగారు నెక్లెస్‌లు కూడా ఉన్నాయి. వాటికి కాపలాగా అన్నట్టు ఆ పాము పడగ విప్పి కూర్చుని ఉంది. ఆ ఇంట్లో వారు ఆ పామును తరమడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంట్లో వారిపై ఆ పాము కోపంగా బుస కొడుతున్నట్టు కూడా ఆ వీడియోలో కనబడుతోంది (terrifying snake video). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు నాలుగు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 1.5 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అసలు లాకర్‌లోకి పాము ఎలా వెళ్లిందని ఒకరు ప్రశ్నించారు. ఆ సంపదను దోచుకోవడం ఎవరి తరమూ కాదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..
ఈ ఫొటోలో చిలుక మాత్రమే కాదు.. బాటిల్ కూడా ఉంది.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..