Snake Ramp Walk: వామ్మో.. ఈ పాము నడక మోడల్‌కు తక్కువగా లేదు.. ఎలా ర్యాంప్ వాక్ చేస్తోందో చూడండి..
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:20 PM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను చూస్తే వణికిపోతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ భారీ నాగుపాము నడక చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను (King Cobra) చూస్తే వణికిపోతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ భారీ నాగుపాము నడక చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. దాదాపు 10 అడుగుల పొడవున్న ఆ భారీ విష సర్పం ఓ మోడల్ తరహాలో వాకింగ్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Snake Ramp Walk).
@askbhupi అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. దాదాపు పది అడుగుల పొడవున్న ఓ కింగ్ కోబ్రా ఒక చిన్న కొండపైకి ఎక్కుతున్నట్లు కనబడుతోంది. ఆ పామును చూసిన ప్రజలు వెనుక నుంచి అరుస్తున్నారు. నలుపు రంగులో ఉన్న ఆ పాము ఎవరికీ హానీ తలపెట్టకుండా అడవి వైపు వెళ్లిపోతోంది. ప్రజలు కూడా ఆ పాముకు హాని తలపట్టేందుకు ప్రయత్నించలేదు. అయితే ఆ వీడియోలోని పాము పాకుతున్న తీరు చూస్తే మాత్రం ఆశ్చర్యం అనిపించకమానదు.
ఆ భారీ సర్పం కొండ పైకి పాకుతున్న తీరు చూస్తే ఓ మోడల్ ర్యాంప్‌పై నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మెలికలు తిరుగుతూ ఆ పాము పైకి వెళ్తోంది. ఆ పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 3.2 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. చాలా మంది ఆ పాము వాకింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..