Kannada Veteran Dinesh Mangaluru: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు మృతి
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:51 PM
దినేష్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, దినేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం దినేష్ అంత్యక్రియలు జరగనున్నట్లు వారు తెలిపారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు దినేష్ ((Kannada Veteran Dinesh Mangaluru) మంగళూరు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 66 ఏళ్ల వయసులో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. దినేష్ నాటకాల్లోంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్లు చేశారు. మొత్తం 200 సినిమాల్లో ఆయన నటించారు. కన్నడ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉలిదవరు కండంతే, కిర్రిక్ పార్టీ, రిక్కీ, అతిధి, ఆ దినగలు వంటి హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేశారు.
ప్యాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్’లోనూ ఆయన నటించారు. ఆ సినిమాలో బాంబే డాన్ క్యారెక్టర్ చేశారు. దినేష్(Ator Dinesh Mangaluru) నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా పలు సినిమాలు చేశారు. నెంబర్ 73, శాంతినివాసతో పాటు పలు సినిమాలకు పని చేశారు. కొన్నేళ్ల క్రితం శివమొగ్గ జిల్లాలోని కొడచాద్రి అనే ప్రాంతంలో సెటిల్ అయ్యారు. సంవత్సరం క్రితం ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. దీంతో కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.
ఈ నేపథ్యంలోనే ఇంట్లో హఠాత్తుగా మరణించారు. దినేష్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు (Kannada Cinema) తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, దినేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం దినేష్ అంత్యక్రియలు జరగనున్నట్లు వారు తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన భౌతికకాయాన్ని బెంగళూరుకు తీసుకురానున్నారు. అక్కడ అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి
రోగిలా ఆస్పత్రిలోకి వచ్చి ఐఫోన్ ఎత్తుకెళ్లాడు.. 60 నిమిషాల్లోనే..
నోయిడా నిక్కి మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో బావ..