Share News

Noida Dowry Assasination Case: నోయిడా నిక్కి మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో బావ..

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:45 AM

విపిన్ వారినుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీస్ తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అతడి కాలుకు బుల్లెట్ తగిలింది.

Noida Dowry Assasination Case: నోయిడా నిక్కి మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో బావ..
Noida Dowry Assasination Case

నోయిడాకు చెందిన వివాహిత నిక్కి భటి మర్డర్ కేసుకు(Noida Dowry Assasination Case) సంబంధించి మూడో అరెస్ట్ నమోదైంది. నిక్కి బావ రోహిత్ భటిని పోలీసులు అరెస్ట్ చేశారు. 36 లక్షల రూపాయల అదనపు కట్నం కోసం భర్త విపిన్, అత్త దయ, బావ రోహిత్‌లు నిక్కిని వేధించేవారు. కేవలం నిక్కిని మాత్రమే కాదు.. ఆమె అక్కను కూడా వేధించేవారు. నిక్కి అక్క కాంచన విపిన్‌ అన్న రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. అత్తింటి వారు అక్కాచెల్లెళ్లను ప్రతీరోజూ కొట్టేవారు. అదనపు కట్నం తీసుకురావాలని చిత్ర హింసలు పెట్టేవారు.


పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. గత గురువారం అత్తింటి వారందరూ కలిసి దారుణానికి ఒడిగట్టారు. నిక్కి, కాంచన్‌పై దాడి చేశారు. నిక్కిని రక్తం వచ్చేలా కొట్టారు. (Noida Dowry Case) తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆమెను పొరిగింటి వాళ్లు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విపిన్‌ను అరెస్ట్ చేశారు. నిన్న హత్యకు వాడిన పెట్రోల్ బాటిల్ కోసం విపిన్‌ను అతడి ఇంటికి తీసుకెళ్లారు.


విపిన్ వారినుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీస్ తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అతడి కాలుకు బుల్లెట్ తగిలింది. గాయపడ్డ అతడ్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇక, ఇదే కేసుకు (Nikki Bhati Dowry Case) సంబంధించి నిన్న నిక్కి అత్త దయను అరెస్ట్ చేశారు. ఈ రోజు రోహిత్‌ను అరెస్ట్ చేశారు. హత్యలో భాగమైన ముగ్గురూ జైలు పాలయ్యారు. అయితే, నిక్కి తండ్రి మాత్రం తన కూతుర్ని చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.


ఇవి కూడా చదవండి

మనిషి మెదడులోకి ప్రవేశించిన అమీబా.. అక్కడి మాంసం తినేసి..

జుట్టు పెరగడం ఆగిపోయిందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

Updated Date - Aug 25 , 2025 | 11:53 AM