Share News

Rare Brain Eating Amoeba: మనిషి మెదడులోకి ప్రవేశించిన అమీబా.. అక్కడి మాంసం తినేసి..

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:09 AM

అమెరికా వ్యాప్తంగా ప్రతీ ఏటా కేవలం 10 కంటే తక్కువ నాల్జేరియా ఫౌలేరీ కేసులు నమోదు అవుతున్నాయి. 1962 నుంచి ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా 167 కేసులు మాత్రమే రికార్డుల్లో ఉన్నాయి.

Rare Brain Eating Amoeba: మనిషి మెదడులోకి ప్రవేశించిన అమీబా.. అక్కడి మాంసం తినేసి..
Rare Brain Eating Amoeba

అమెరికాలోని మిస్సోరికి చెందిన ఓ వ్యక్తి అత్యంత అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Rare Brain Eating Amoeba) ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయాడు. ఓజార్క్స్ సరస్సులో ఈత కొట్టడం వల్ల బ్రెయిన్ ఈటింగ్ అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు మిస్సోరి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సీనియర్ సర్వీసెస్ భావిస్తోంది. ఆ వ్యక్తి నాల్జేరియా ఫౌలేరీ అనే మైక్రోస్కోపిక్ అమీబా బారిన పడ్డట్టు ఆగస్టు 13వ తేదీన అధికారులు ధ్రువీకరించారు.  నాల్జేరియా ఫౌలేరీ అనేది ఏక కణ జీవి. దీన్నే ‘మెదడును తినే అమీబా’ అంటారు.


ఈ అమీబా కారణంగా మనుషుల్లో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వస్తుంది. ఇది ఒక అత్యంత అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. దీన్నే ‘మెదడును తినే వ్యాధి’ అని కూడా అంటారు. ఓజార్క్స్ సరస్సులో ఈత కొట్టినపుడు నాల్జేరియా ఫౌలేరీ బాధితుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత అతడి మెదడును చేరి ప్రాణాలు తీసింది. మిస్సోరి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సీనియర్ సర్వీసెస్ చెబుతున్న దాని ప్రకారం.. నాల్జేరియా ఫౌలేరీ ఇన్‌ఫెక్షన్లు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.


అమెరికా వ్యాప్తంగా ప్రతీ ఏటా కేవలం 10 కంటే తక్కువ నాల్జేరియా ఫౌలేరీ కేసులు నమోదు అవుతున్నాయి. 1962 నుంచి ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా 167 కేసులు మాత్రమే రికార్డుల్లో ఉన్నాయి. మిస్సోరీలో గతంలో రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఒకటి 1987లో కాగా, మరొకటి 2022లో నమోదైంది. నాల్జేరియా ఫౌలేరీ కారణంగా మనుషులు చనిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. అమీబా మెదడులోకి ప్రవేశించిన తర్వాత అక్కడి కణజాలాన్ని నాశనం చేస్తుంది.


నాల్జేరియా ఫౌలేరీ కలుషితమైన నీళ్ల ద్వారా సోకుతుంది. ఆ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. దాదాపు 12 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు అవుతాయి. ఇన్‌ఫెక్షన్ పెరిగే కొద్ది దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి కోమాలోకి వెళ్లి చనిపోయే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

భర్తకు ప్రాణం పోద్దామనుకుంది.. పాపం తను కూడా..

అన్నా చెల్లెళ్ల బంధం.. మంగళ సూత్రం కోసం హత్య..

Updated Date - Aug 25 , 2025 | 11:10 AM