Share News

Wifes Live Liver Donation: భర్తకు ప్రాణం పోద్దామనుకుంది.. పాపం తను కూడా..

ABN , Publish Date - Aug 25 , 2025 | 10:10 AM

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే తప్ప అతడు బతకటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో అతడి భార్య లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీన ఆపరేషన్ జరిగింది.

Wifes Live Liver Donation: భర్తకు ప్రాణం పోద్దామనుకుంది.. పాపం తను కూడా..
Wifes Live Liver Donation

ఒక ఆపరేషన్ రెండు జీవితాలను బలి తీసుకుంది. లివర్ సమస్యతో బాధపడుతున్న భర్తను కాపాడుకోవాలనుకున్న భార్య ప్రయత్నం ఘోరంగా బెడిసికొట్టింది. ఆపరేషన్ ఫెయిల్ అయింది. భర్తతో పాటు ఆమె కూడా చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణెకు చెందిన బాపు కోమ్కర్ గత కొన్నేళ్ల నుంచి లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు.


గత కొన్నినెలల నుంచి అతడి పరిస్థితి దారుణంగా తయారైంది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే తప్ప అతడు బతకటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో అతడి భార్య లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీన ఆపరేషన్ జరిగింది. అయితే, ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. బాపు ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులకే.. ఆగస్టు 17వ తేదీన అతడు చనిపోయాడు. ఆ తర్వాత కామిని లివర్ దగ్గర ఇన్‌ఫెక్షన్ మొదలైంది. డాక్టర్లు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు.


చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 21వ తేదీన చనిపోయింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కారణంగా ఇద్దరూ చనిపోవటంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్జరీ జరిగిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరూ చనిపోయారని, ఈ మరణాలపై దర్యాప్తు చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదివారం స్పందించింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసిజర్‌కు సంబంధించిన అన్ని వివరాలు సోమవారానికి(ఈ రోజు) ఇవ్వాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

జుట్టు పెరగడం ఆగిపోయిందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

అన్నా చెల్లెళ్ల బంధం.. మంగళ సూత్రం కోసం హత్య..

Updated Date - Aug 25 , 2025 | 11:38 AM