Thief Disguises As Disabled Person: రోగిలా ఆస్పత్రిలోకి వచ్చి ఐఫోన్ ఎత్తుకెళ్లాడు.. 60 నిమిషాల్లోనే..
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:35 PM
మహ్మద్ ఫయాజ్ రోగిలా నాటకమాడి హాల్లెట్ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూ అక్కడి సిబ్బందిని తన అద్భుతమైన నటనతో నమ్మించాడు.
ఓ యువకుడు రోగిలా నాటకమాడి ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా డాక్టర్ కోటులోంచి ఐఫోన్ కొట్టేశాడు. మెల్లగా ఆస్పత్రినుంచి జారుకున్నాడు. అయితే, దొంగతనం జరిగిన 60 నిమిషాల్లోనే అతడు పోలీసులకు దొరికిపోయాడు. అతడు పోలీసులకు ఎలా దొరికిపోయాడో తెలుసుకోవాలంటే ఈ దొంగతనం స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మహ్మద్ ఫయాజ్ ఫోన్ దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఆగస్టు 20వ తేదీన రోగిలా నాటకమాడి హాల్లెట్ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూ అక్కడి సిబ్బందిని తన అద్భుతమైన నటనతో నమ్మించాడు. రెప్పపాటులో ఓ జూనియర్ డాక్టర్ కోటులోంచి ఐఫోన్ కొట్టేశాడు. మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు. ఫోన్ కనిపించకపోవటంతో బాధిత జూనియర్ డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ మొదలెట్టారు.
ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో మహ్మద్ ఫయాజ్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. పోలీసులు వెంటనే మహ్మద్ ఫయాజ్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐఫోన్ స్వాధీనం చేసుకుని, జూనియర్ డాక్టర్‌కు అప్పగించారు. దొంగతనం జరిగిన 60 నిమిషాల్లోనే కేసు సాల్వ్ అయింది. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ‘దొంగకంటే ఎంతో తెలివిగా ఆలోచించి దొంగను పట్టుకున్న పోలీస్ టీమ్‌కు శుభాకాంక్షలు. సీసీటీవీ ఫుటేజీల వల్లే కేసు సాల్వ్ చేయటం జరిగింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నోయిడా నిక్కి మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో బావ..
మనిషి మెదడులోకి ప్రవేశించిన అమీబా.. అక్కడి మాంసం తినేసి..